2025లో నక్కతోక తొక్కే అదృష్టరాశులు ఇవేనని ప్రకటించిన బృహస్పతి!

జ్యోతిష శాస్త్రంలో దేవగురువు అయిన బృహస్పతికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. 2025 కొత్త సంవత్సరంలో బృహస్పతి మిధున రాశిలో సంచారం చేయనున్నాడు. మిధున రాశిలో బృహస్పతి దాదాపు 13 నెలల పాటు సంచారం చేస్తాడు. మిధున రాశిలో బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మేధస్సుకు, సంపదలకు, దానధర్మానికి, విద్యకు ప్రతీకగా చెప్పే బృహస్పతి మిధునరాశిలో సంచారం వల్ల కలిసొచ్చే రాశులేమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి బృహస్పతి సంచారం కారణంగా 2025 సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. బృహస్పతి ఈ రాశిలో ఆదాయ స్థానంలో సంచారం చేస్తాడు. దీంతో ఆర్థికంగా మీకు మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి నూతన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. బృహస్పతి సంచారం కారణంగా వృషభ రాశి వారికి భారీగా లాభాలు వస్తాయి.

Jupiter has announced that these are the lucky zodiac signs that will get huge wealth in 2025

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి బృహస్పతి సంచారం 2025 సంవత్సరంలో ప్రయోజనాలను ఇస్తుంది. ఈ రాశిలో గురుడు ఏడవ స్థానంలో సంచారం చేస్తాడు. ఈ సమయంలో అనేక రంగాలలో కొత్త అవకాశాలు వస్తాయి. ఇది ఆర్థికంగా వృశ్చిక రాశి వారికి లాభాలను ఇచ్చే సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు .ఆదాయం పెరుగుతుంది. అవివాహితులకు వివాహాలు అయ్యే అవకాశం ఉంది.

కుంభరాశి
బృహస్పతి సంచారం కుంభ రాశి వారికి లాభాలను ఇస్తుంది. 2025 సంవత్సరంలో వీరు ఏ పని చేసినా కలిసొస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఆర్థికంగా మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం.

మీన రాశి
బృహస్పతి సంచారం కారణంగా మీన రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీనరాశిలో గురుడు 4వ స్థానంలో సంచారం చేస్తాడు. దీంతో మీన రాశి వారికి భూములు, ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+