దసరా పండుగకు మీకు సంపదల ఖజానా బహుమతినిచ్చిన బృహస్పతి!
వేద జ్యోతిష శాస్త్రంలో బృహస్పతి గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో సంచరిస్తుంది . దసరా నవరాత్రుల సమయంలో బృహస్పతి సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. 2024 మే 1వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట 50 నిమిషాలకు వృషభ రాశిలోకి బృహస్పతి ప్రవేశించింది.
నవరాత్రులలో బృహస్పతి సంచార ప్రభావం
ప్రస్తుతం వృషభరాశిలోనే బృహస్పతి సంచరిస్తుంది. 2025 మే 15వ తేదీన తెల్లవారుజామున రెండు గంటల 30 నిమిషాలకు వృషభ రాశి నుంచి నిష్క్రమించి బుధుడు పాలించే గ్రహమైన మిధున రాశిలోకి ప్రవేశిస్తుంది. దేవ గురువు బృహస్పతి ప్రస్తుతం నవరాత్రుల సమయంలో వృషభ రాశిలో సంచరిస్తున్న కారణంగా కొన్ని రాశులవారి పైన కనక వర్షం కురుస్తుంది. బృహస్పతి ప్రత్యేక ప్రభావం వలన అదృష్టాన్ని మూటకట్టుకుంటున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభరాశి
దేవగురువు బృహస్పతి సంచారం కారణంగా వృషభ రాశి వారికి ఇది అద్భుతమైన సమయంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వృషభ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. బంగారం తదితర వ్యాపారాలలో స్థిరపడిన వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది వృషభరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే కాలం. ప్రయాణాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.
మిధున రాశి
మిధున రాశి వారికి బృహస్పతి సంచారం కారణంగా ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశీయానం చేసే వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. మిధున రాశి వారికి బృహస్పతి సంచారం శుభాలను చేకూరుస్తుంది.
మీనరాశి
మీన రాశి వారికి బృహస్పతి సంచారం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. మీన రాశి జాతకులు ఈ సమయంలో కొత్త వాహనాలను, ఇళ్ళను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి విపరీతమైన లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారు పనిలో ఉన్న ఇబ్బందులను అధిగమించి విజయాలను సాధిస్తారు. ఇంతకాలం పై చేయి సాధించిన శత్రువులు ఈ సమయంలో మీ ధాటికి నిలవలేరు. ఇది మీన రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications