బృహస్పతి-కుజ సంయోగం.. నేటినుండి ఈరాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా రాశుల జాతకాలు మారతాయి అన్న విషయం తెలిసిందే. ఇక నేడు నవగ్రహాలలో ముఖ్యమైన కుజగ్రహం మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. నేటి నుండి 45 రోజులపాటు వృషభ రాశిలో ఉంటాడు. ఇప్పటికే వృషభరాశిలో బృహస్పతి ఉన్న కారణంగా నేడు కుజ ప్రవేశంతో బృహస్పతి కుజుల సంయోగం జరుగుతుంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది..
మేషరాశి
మేష రాశి వారికి బృహస్పతి కుజ గ్రహ కలయిక మెరుగైన ఫలితాలను ఇస్తుంది. దీనివల్ల మేషరాశి జాతుకుల ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వర్ధక వ్యాపారాలు చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుండి ఊరట లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో మేష రాశి జాతకులకు ఏ పని చేసినా కలిసొస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి.

కర్కాటకరాశి
బృహస్పతి కుజ గ్రహాల కలయిక కారణంగా కర్కాటక రాశి జాతకులకు కలిసొస్తుంది. ఈ సమయంలో వీరి కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో చేసే ప్రయాణాలు కూడా ప్రత్యేకమైన ప్రయోజనాలను ఇస్తాయి. మీరు ఏ కోరిక కోరుకున్న ఈ సమయంలో నెరవేరుతుంది. తోడబుట్టిన వారి నుంచి ప్రయోజనాన్ని పొందుతారు.
సింహరాశి
బృహస్పతి కుజ గ్రహాల కలయిక సింహ రాశి వారికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు చేసే పనికి గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి సరైన సమయం. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా గొప్ప విజయాలు కలుగుతాయి.
కన్యారాశి
కుజుడు బృహస్పతి కలయిక కారణంగా కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని ఈరోజు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో అతిథులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కుజుడు బృహస్పతి కలయిక కన్యా రాశి వారి జీవితాన్ని సానుకూల ఫలితాలతో ముంచేస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications