బృహస్పతి రాహు సంయోగం: గురు చండాల యోగం: ఈ రాశులకు కలిసొచ్చే కాలం!!

బృహస్పతి - రాహువు సంయోగం వల్ల వివిధ రాశుల వారికి మంచి రోజులు వస్తాయని చెబుతున్నారు. మేషరాశిలో బృహస్పతి రాహువు సంయోగం వల్ల ఏర్పడే గురు చండాల యోగం ఏప్రిల్ 22వ తేదీ నుండి 30వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే ఈ యోగం శుభప్రదంగా పరిగణించబడనప్పటికీ కొన్ని రాశుల వారికి మాత్రం ఇది అదృష్టాన్ని తెస్తుంది.

ఈ సమయంలో వారికి బాగా కలిసి వస్తుంది. 30వ తేదీ వరకు కలిసొచ్చే ఆ రాశులు ఏమిటంటే ప్రస్తుతం మనం తెలుసుకుందాం. బృహస్పతి రాహువు సంయోగం వల్ల ఏర్పడే గురుచండాల యోగం మేష రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. రాహువు బృహస్పతి కలయిక మేష రాశి వారికి ఆకస్మిక ధన లాభాన్ని కలిగిస్తుంది.

Jupiter Rahu Conjunction: Guru Chandala Yoga: luck for these zodiac signs!!

మేష రాశి వారి గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించే సమయం ఇది. వారు పెట్టిన పెట్టుబడుల నుండి ప్రయోజనాలను కూడా పొందుతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విజయం సాధించడానికి ఇది మంచి కాలం.

గురు చండాల యోగం వల్ల లాభపడే మరొక రాశి సింహరాశి. సింహరాశి జాతకులకు బృహస్పతి రాహువు కలయిక అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇది అదృష్టాన్ని తీసుకువస్తుంది. దీనివల్ల మీ ఆరోగ్యం, మీ తండ్రి ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంది. మతపరమైన కార్యక్రమాలలో, కుటుంబపరమైన వివాహాది వేడుకలలో పాల్గొనే అవకాశం ఉంది. సింహరాశి విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగానూ, శుభప్రదం గానూ ఉంటుంది.

బృహస్పతి రాహువు సంయోగం వల్ల ఏర్పడే గురు చండాల యోగం తో ధనుస్సు రాశి జాతకులకు మంచి ఫలితాలు ఉంటాయి. ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ధనుస్సు రాశి వారు స్టాక్ మార్కెట్ నుండి పొందుతారు. బంగారం కొనుగోలు అమ్మకాలు చేసే వారు కూడా లాభాలను పొందుతారు. బృహస్పతి రాహువు సంయోగం వల్ల ధనస్సు రాశి వారికి వృత్తిలో పురోగతి కనిపిస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+