మేషరాశిలో బృహస్పతి తిరోగమనం: 4నెలలు 3రాశుల వారికి అదృష్టం!!

సెప్టెంబరు నాలుగవ తేదీన బృహస్పతి మేషరాశిలో తిరోగమనము లోకి వెళ్ళింది. సెప్టెంబర్ 4న బృహస్పతి మేషరాశిలో తిరోగమనం మొత్తం నాలుగు నెలల పాటు కొనసాగనుంది. ఈ సమయంలో నిర్దిష్ట రాశుల వారికి జీవితంపై గురుడు యొక్క ఆశీర్వాదం ఉంటుంది. మేషరాశిలో బృహస్పతి తిరోగమన సమయంలో నాలుగు నెలల పాటు లాభపడే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

బృహస్పతి మేషరాశిలో తిరోగమనం చేయడంతో సింహరాశి వారు లాభపడతారు. సింహ రాశి వారు పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సింహ రాశి వారు కుటుంబ వృద్ధిని లేదా పిల్లల శ్రేయస్సుకు సంబంధించిన విజయాలను ఈ సమయంలో పొందుతారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.

Jupiter retrograde in aries: These zodiac signs are super lucky!!

ఈ సమయంలో ఉన్న అవరోధాలు అన్ని అధిగమించబడి సింహ రాశి వారికి విజయం చేకూరుతుంది. బృహస్పతి తిరోగమనం విదేశీ ప్రయాణానికి అవకాశాలను సూచిస్తుంది. ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి గణనీయంగా పెరుగుతుంది. సింహరాశి వారికి పరిష్కారం కాని సమస్యలు ఉంటే పరిష్కారం అవుతాయి.

మేషరాశిలో బృహస్పతి తిరోగమనం తో మకర రాశి వారికి శుభాలు జరుగుతాయి. మకర రాశి వారికి రియల్ ఎస్టేట్ ఆస్తులలో పెట్టుబడులు మరియు మోటర్ రంగాలలో గణనీయమైన పురోగతి సాధించడానికి ఇది మంచి సమయం. మకర రాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇదే సరైన సమయం.

బృహస్పతి తిరోగమనం వల్ల మకర రాశి వారికి పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. మేషరాశిలో బృహస్పతి తిరోగమనం మకర రాశి వారికి సానుకూల మార్పులకు, అదేవిధంగా ఆర్థిక శ్రేయస్సు కు కారణం అవుతుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

ధనుస్సు రాశి వారికి మేషరాశిలో బృహస్పతి తిరోగమనం లాభిస్తుంది. ఈ సమయంలో వీరిలో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. బృహస్పతి తిరోగమనం వల్ల ధనుస్సు రాశి జాతకులు కుటుంబ విషయంలో సంతోషకరమైన విషయాలను వింటారు. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో ఆర్థిక విజయాలను సాధిస్తారు. వివేకవంతమైన పెట్టుబడులు పెడతారు. ఈ సమయంలో ఆర్థిక స్థిరత్వం వీరి సంతోషానికి కారణమవుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+