దేవగురువు దయతో ఆగస్టు 20వరకు ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్టే!!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారి పైన ప్రభావం కనిపిస్తుంది. గ్రహాల గమనం వివిధ రాశులలోకి, వివిధ నక్షత్రాలలోకి జరుగుతూ ఉంటుంది. గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా దేవ గురువు బృహస్పతిని చెప్తారు. ప్రస్తుతం దేవ గురువు బృహస్పతి రోహిణి నక్షత్రంలో ఉన్నాడు.

రోహిణీ నక్షత్రంలో బృహస్పతి
జూన్ 13 2024 తేదీన బృహస్పతి రోహిణి నక్షత్రం లోకి ప్రవేశించాడు. ఆగస్ట్ 20 వరకు ఈ నక్షత్రంలోనే ఉంటాడు. రోహిణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు. బృహస్పతి శుక్రుడుకి చెందిన రాశి అయిన వృషభరాశిలోనూ, అలాగే నక్షత్రమైన రోహిణి నక్షత్రం లోనూ సంచరిస్తున్నాడు. ఇక ఈ సమయంలో రోహిణి నక్షత్రంలో దేవగురువైన బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి నక్కతోక తొక్కినంత అదృష్టం. మరి ఆ రాశులేమిటో తెలుసుకుందాం.

Jupiter transit in rohini nakshatra till August 20th good fortune to these zodiac signs

వృషభ రాశి
బృహస్పతి రోహిణి నక్షత్ర సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక లాభాలను చూస్తారు. వర్తక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో సంపద వృద్ధి చెందుతుంది. శ్రేయస్సు కలుగుతుంది.

సింహరాశి
బృహస్పతి రోహిణి నక్షత్ర సంచారం కారణంగా సింహరాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయం ఉద్యోగస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో సింహరాశి జాతకులు శుభవార్తలు అందుకుంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. బృహస్పతి ప్రభావంతో బాగా డబ్బు సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి
బృహస్పతి రోహిణి నక్షత్ర సంచారం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ధనుస్సు రాశి జాతకులు స్టాక్ మార్కెట్లో కానీ ఆస్తుల కొనుగోలుకు కానీ పెట్టుబడులు పెట్టడానికి ఉత్తమ సమయం. ఏదైనా కొత్త పనులు ప్రారంభిస్తే అవి పూర్తిగా లాభాలను తీసుకువస్తాయి. ఊహించని ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో కోర్టు కేసులలోనూ విజయాన్ని సాధిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+