త్వరలో వీరికి సంపదల ఖజానా రాసిచ్చిన బృహస్పతి!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి ప్రత్యేకమైన స్థానముంది. బృహస్పతి 2024 మే నెలలో మేష రాశి నుండి వృషభ రాశిలోకి సంచారం చేసి ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం వృషభ రాశి లోనే బృహస్పతి సంచారం కొనసాగుతుంది. ఇక 2025 సంవత్సరం మే నెల 14వ తేదీన బృహస్పతి మిధున రాశిలోకి వెళ్ళనున్నాడు.

మిధునరాశిలో బృహస్పతి సంచారం
బృహస్పతి మిధున రాశి సంచారం కచ్చితంగా అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. బృహస్పతి బుధుని సొంత రాశి అయిన మిధున రాశిలోకి సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి లబ్ధి చేకూరుతుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Jupiter will soon grant these zodiac signs a treasury of wealth

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు బృహస్పతి సంచారం కారణంగా లబ్ధి జరుగుతుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఊహించని దానికంటే ఎక్కువ ధన ప్రవాహాన్ని పొందుతారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు బృహస్పతి సంచారం కారణంగా లబ్ధి జరుగుతుంది. బృహస్పతి ఈ సమయంలో మీకు ఆర్థిక లాభాలను ఇవ్వబోతున్నాడు. వృశ్చిక రాశి జాతకులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ప్రేమ జీవితంలో కూడా సంతోషం ఉంటుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ముందుకు సాగుతారు.

కుంభరాశి
బృహస్పతి సంచారం కుంభ రాశి వారికి లాభాలను ఇస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఆర్థికంగా మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. 2025 సంవత్సరంలో వీరు ఏ పని చేసినా కలిసొస్తుంది.

మీన రాశి
బృహస్పతి సంచారం కారణంగా మీన రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. మీనరాశిలో గురుడు 4వ స్థానంలో సంచారం చేస్తాడు. దీంతో మీన రాశి వారికి భూములు, ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.ఈ సమయంలో కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+