Jyeshtha Purnima 2024... నేటినుండి ఈ రాశులవారి పంట పండినట్టే!!

జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని జేష్ఠ పౌర్ణమి అంటారు. జూన్ 21వ తేదీన మనం జ్యేష్ఠ పౌర్ణమిని జరుపుకుంటున్నాం. హిందూ ధర్మం ప్రకారం ప్రతినెలా వచ్చే పౌర్ణమి తిధికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే జ్యేష్ఠ పౌర్ణమికి అంతకంటే ఎక్కువ విశేషం ఉంటుంది. ఈ మాసంలో ఈసారి పౌర్ణమి చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఈ జేష్ట పౌర్ణమి కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది.

నేడే జ్యేష్ఠ పౌర్ణమి
నేడు జేష్ఠ పౌర్ణమి సందర్భంగా పవిత్ర నదిలో స్నానమాచరించి, శ్రీమహావిష్ణువుని పూజించడం వలన, దానధర్మాలు చేయడం వలన శుభ ఫలితాలు వస్తాయి. జ్యేష్ఠ పౌర్ణమి ఒక శుభయోగంగా భావిస్తారు. ఇక ఇదే సమయంలో శుక్ర ఆదిత్య రాజయోగం, బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల కూడా జ్యేష్ఠ పౌర్ణమి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదమని చెప్పబడింది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Jyeshtha Purnima 2024 from today the these zodiac signs will get wealth

వృషభరాశి
వృషభ రాశి వారికి జ్యేష్ఠ పౌర్ణమి నుండి మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఈ సమయంలో పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.

ధనుస్సు రాశి
జ్యేష్ఠ పౌర్ణమి ధనుస్సు రాశి జాతకులకు శుభకాలానికి నాంది పలికింది. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు నూతన ఉద్యోగాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను గడించడంతోపాటు, వ్యాపారాలను విస్తరిస్తారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి మంచి సంతోషకాలం. వివాహితులకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది.

సింహరాశి
జేష్ఠ పౌర్ణమి సింహ రాశి జాతకులకు లబ్ధిని చేకూరుస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఆర్థికంగా పుష్టిగా ఉంటారు. గతంలో పెట్టిన పెట్టుబడిల నుండి లాభాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పూర్వీకుల ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి శుభ సమయం. ఉద్యోగాలు మారాలి అనుకునే వారికి కూడా ఇదే సరైన సమయం. ఆస్తులు లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+