Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వివాహానికి జాతకాలు కలవాలా, తప్పదా?

Recommended Video

    పెళ్లికి జాతకం చూడకపోతే ఏమవుతుంది ? | Oneindia Telugu

    వివాహ నిశ్చయానికి ముందు పిల్ల, పిలగాడి జాతకాలు చూడటం మన సంప్రదాయం. జ్యోతిషంపై ఉన్న నమ్మకం వల్లనే వాటిని చూపించుకోవడం జరుగుతుంది.. వధూ వరుల జాతక భాగమును సప్తమ, అష్టమ స్థానాలను చూస్తారు. సప్తమ, అష్టమ స్థానములు మిత్ర రాశులు, మిత్ర గ్రహాలు అయితేనే వివాహాన్ని నిర్ణయించుకుంటారు.

    వివాహానికి వధూవరుల జాతకాలు కలవాలని, పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలని అనుకుంటారు. జాతకాలు కలిస్తే వధూవరులు జీవితంలో కూడా కలసిమెలసి ఉంటారు అంటున్నారు.

    అందుకే ఆయా దేశాల్లో...

    అందుకే ఆయా దేశాల్లో...

    భూమి మీద జీవిస్తున్న మనుషులపై ఖగోళంలో ఉన్న గ్రహాల ప్రభావం ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అన్ని దేశాలలోను వివాహాలు జరుగుతున్నాయి గానీ అక్కడ విడాకులు, కలహాలు, చిన్న వయస్సులో మరణాలు ఎక్కువగా గమనిస్తామని, కారణం ఈ జాతక దోషాలేదేనని జ్యోతిష్కులు అంటున్నారు.

    కనీసం అరవై శాతం..

    కనీసం అరవై శాతం..

    వివాహానికి ముఖ్యమైన పొంతనలలో కనీసం 60 శాతం కలవాలని, జన్మించిన నక్షత్రాల ప్రభావం, రాశులు, నక్షత్రాల గణాలు, వాటి నాడులు, వాటి మైత్రి వంటి విషయాలు చూసి వివాహానికి అనుకూలమా? కాదా? అంచనా వేస్తారు.

    జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషం

    జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషం

    నవగ్రహాల ప్రభావం మన జీవితంలో 12 కోణాలుగా ఉంటుందని, జన్మించిన సమయంలో ఆ గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి, మన జీవితంలో మంచిచెడులు జరుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతుందని అంటున్నారు. కాబట్టి ఆ శాస్త్ర నియమాలను జీవితంలో ప్రధాన ఘట్టమైన వివాహానికి కూడా తప్పనిసరిగా పరిశీలించాలని అభిప్రాయపడుతున్నారు. భారత ఉపఖండంలో పుట్టి పెరిగేవారి కోసం ఇక్కడ భూమి నుంచి ఆయా గ్రహాలు ఉన్న దూరాలను, డిగ్రీలను బట్టి, ఫలితాలను నిర్ణయించే శాస్త్రం ఏర్పడిందని పండితుల అభిప్రాయం.

    జాతకాలు చూడడమంటే..

    జాతకాలు చూడడమంటే..

    జాతకాలు చూడడమంటే అవతల వ్యక్తి గురించి ప్రాథమిక సమాచారం సేకరించడమని అంటున్నారు. ఏ లగ్నంలో పుట్టారో, ఆ గ్రహం నుంచి లెక్కించాలి. జాగ్రత్తలు తీసుకోవడమే జ్యోతిషమని అభిప్రాయపడుతున్నారు.

    వాటికి స్వభావం ఉంటుంది..

    వాటికి స్వభావం ఉంటుంది..

    నక్షత్రాలకు రాసులకు స్వభావం ఉందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఏ నక్షత్రానికి, ఏ నక్షత్రం సరిపడుతుందో చూసుకోవాలి. ఏ రాశిలో పుట్టినవారికి ఏ రాశివారితో సరిపోలుతుందో పరిశీలించాలి.శని, కుజుడు కలిస్తే కుదురదు. గురువు చంద్రుడు ఒకచోట చేరితే సంతోషం, ఆనందం ఉంటాయి. ఒక జంటకు వివాహం చేసేటప్పుడు ఆ ఇద్దరూ కలిసి జీవించగలిగే లక్షణాలు ఎంతవరకు ఉన్నాయో చూడాలని అభిప్రాయపడుతున్నారు.

    కుజదోషం వల్ల

    కుజదోషం వల్ల

    కుజదోషం వల్ల వియోగం, విరహం, కలహం కలుగుతాయి. కొందరు సమాజం కోసం కలిసే ఉంటారు. కాని వారి వైవాహిక జీవితం సరిగా ఉండదు. కొందరిలో మాత్రం సంతానం కలిగితే అన్నీ సర్దుకుపోతాయి. కుటుంబం బలపడుతుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+