కామిక ఏకాదశి: నేడు ఈ పరిహారాలతో లక్ష్మీదేవి అనుగ్రహం; మీ కోరికలు సఫలం!!
హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి ప్రతీనెలలో నెలలో రెండుసార్లు వస్తుంది. అయితే ఏకాదశి శుక్లపక్షము మరియు కృష్ణ పక్షం లో పదకొండవ రోజున వస్తుంది. అయితే శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో పదకొండవ రోజున జరుపుకునే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. 2023 సంవత్సరంలో కామిక ఏకాదశి జులై 13 వ తేదీన, అంటే నేడు జరుపుకుంటారు.
కామిక ఏకాదశి జూలై 12 వ తేదీన సాయంత్రం 6 గంటల 1 నిమిషానికి ప్రారంభమై జూలై 13 వ తేదీన సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకు ముగుస్తుంది. కామిక ఏకాదశి రోజు ఎవరైతే భక్తిశ్రద్ధలతో ఉపవాసాన్ని ఆచరించి శ్రీమహావిష్ణువుని పూజిస్తారో వారి జీవితంలో ఎదురయ్యే అనేక అడ్డంకులు నుండి ఉపశమనం పొందుతారు అని చెబుతారు.

కామిక ఏకాదశి రోజు పూజ చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. కామిక ఏకాదశి రోజు పూజలు చేయడం, దాన ధర్మ పాపాల నుండి విముక్తి లభిస్తుందని మోక్షాన్ని పొందేందుకు ఇది వీలు కల్పిస్తుందని చెబుతారు. కామిక ఏకాదశి నాడు లక్ష్మీదేవి కటాక్షం కావాలి అనుకునే వారు, ఆర్థిక సమస్యల నుండి బయట పడాలి అని భావించేవారు కొన్ని పరిహారాలు చేయాలి అని చెబుతున్నారు.
కామిక ఏకాదశి రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని కలిపి పూజించాలి. ఈ రోజు పసుపు గుడ్డలో రెండు పసుపు నాణేలు, ఒక వెండి నాణాన్ని పెట్టి పసుపు రంగు గవ్వను అందులో పెట్టి, దానిని జాగ్రత్తగా కట్టి దేవుని ముందు పెట్టి భక్తితో పూజించాలి. ఆపై దానిని డబ్బు పెట్టే బీరువాలో పెట్టుకోవాలి. అప్పుడు లక్ష్మీ దేవి ప్రసన్నం అవుతుంది .
ఇక అప్పుల బాధ నుండి విముక్తి పొందాలంటే రావిచెట్టుకు నీళ్లు సమర్పించి నెయ్యి దీపం వెలిగించాలి. అప్పుడు రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యల నుండి బయట పడాలంటే తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించి, ఓం నమో భగవతే నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు చదివితే ఫలితం ఉంటుంది.
కుటుంబ సమస్యల నుండి బయటపడాలంటే దక్షిణావర్తి శంఖాన్ని నీటితో నింపి పూజ చేసేటప్పుడు విష్ణువుకి నైవేద్యంగా సమర్పించాలి. పూజ అనంతరం ఆ నీటిని కుటుంబ సభ్యులందరికీ ప్రసాదంగా పంచాలి. కోరికలు నెరవేరాలంటే కామిక ఏకాదశి నాడు కుంకుమపువ్వును పాలతో కలిపి విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి. తులసి పూసల మాలను ఉపయోగించి ఓం నమో వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108సార్లు చదవాలి. వీటివల్ల విష్ణువు అనుగ్రహం కలుగుతుందని, కోరికలు అన్నిటినీ నెరవేరుస్తాడని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications