Vastu Tips: ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే.. ఈ పని చేయండి..!
చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు పడడానికి వాస్తు దోషం కూడా ఉంటుందట. వాస్తు సరిగా లేకుంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండదట. ఇంట్లో లక్ష్మీ దేవి తిరగాలి అంటే... వాస్తు శాస్త్రం ప్రకారం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. ముఖ్యంగా ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీ దేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఇంటి
ఇంటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతుంది. ఇంటి ప్రధాన ద్వారం ఎంత శుభ్రంగా ఉంటే.. లక్ష్మీ కాటాక్షం అంత పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజూ
ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. గృహోపకరణాలను సరైన స్థలంలో ఉంచాలి. చెత్తను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఇల్లు శుభ్రంగా ఉంటే ఇంటి సభ్యుల పనులన్నీ చక్కగా జరుగుతాయి. ఇల్లు ఎప్పుడూ డబ్బుతో నిండి ఉంటుందట.

ఫర్నీచర్, సోఫాలు
వాస్తు ప్రకారం, ఇంట్లోని ప్రతి మూలను పూర్తిగా శుభ్రం చేయాలి. ఫర్నీచర్, సోఫాలు, బెడ్లు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం, సాయంత్రం తప్పకుండా ఇళ్లు ఉడ్చుకోవాలట.
ఇంటి బాత్‌రూమ్, టెర్రస్, బాల్కనీని కూడా సరిగ్గా శుభ్రం చేయాలి.

సూర్యాస్తమయం
ఇంట్లో బుజును ప్రతి 10 రోజులకు ఓసారి దులుపుకోవాలి. ఇల్లు మురికిగా ఉంటే వాస్తు దోషం వెంటాడుతుంది. వాస్తు ప్రకారం, సూర్యాస్తమయం సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్చకూడదు. ఎందుకంటే లక్ష్మి ఇంటికి వచ్చే సమయంగా భావిస్తారు. చెత్తను బయట వేస్తే లక్ష్మీ దేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందట.
Note: వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ సమాచారం ఇచ్చాం. ఈ సమాచారాన్ని వన్ ఇండియా ధృవీకరించలేదు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications