నవంబర్ 10 వరకు వీరికి ధనపు రాశులను కటాక్షించిన కేతువు!
జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలలో నీడ గ్రహాలూ, అత్యంత క్రూర గ్రహాలూ అని చెప్పబడే రాహు కేతువుల సంచారం సహజంగా ఆశుభాలను కలిగిస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ రాహు కేతువుల సంచారం కొన్ని సందర్భాలలో కొన్ని రాశుల వారికి శుభాలను కూడా కలిగిస్తుంది. సెప్టెంబర్ మాసంలో హస్తా నక్షత్రంలోకి కేతువు సంచారం జరిగింది.
నవంబర్ పదవ తేదీ వరకు హస్తా నక్షత్రంలో కేతువు
సెప్టెంబర్ 9వ తేదీన కేతువు నక్షత్ర సంచారం హస్తా నక్షత్రంలోని మొదటి దశలోకి ప్రయాణమై నవంబర్ పదవ తేదీ వరకు హస్తా నక్షత్రంలోనే సంచరించి ఆ తర్వాత ఉత్తర ఫాల్గుణి నక్షత్రం లోకి ప్రవేశిస్తుంది. ఈ సంచారం అన్ని రాశుల వారిపైన ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ కేతు సంచారం మూడు రాశుల వారికి మాత్రం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం అవుతుంది.

కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి హస్తా నక్షత్రంలోకి కేతువు సంచారం కారణంగా శుభప్రదంగా ఉంటుంది. కర్కాటకరాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగాలు చేసే వారికి బాగుంటుంది. ఏ పని చేసినా విజయాలను సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. నూతన ఆదాయ వనరులను పొందడానికి మార్గాలు తెరుచుకుంటాయి. కొత్త ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కేతువు హస్తా నక్షత్ర సంచారం ప్రయోజనాలను చేకూరుస్తుంది. ధనుస్సు రాశి జాతకులు నూతన ఆదాయ మార్గాలను కనుగొంటారు. వ్యాపారాలు ఈ సమయంలో పుంజుకునే అవకాశం ఉంది. కొత్త వ్యాపార భాగస్వాములను కనుగొనడం ద్వారా వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు.
ఉద్యోగస్తుల ఆదాయంలోను పెరుగుదల కనిపిస్తుంది. ఆస్తుల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు.
కుంభరాశి
కుంభ రాశి వారికి హస్తా నక్షత్రం లోకి కేతువు సంచారం కారణంగా కలిసొస్తుంది. కుంభ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించని మద్దతు లభిస్తుంది. పెద్ద పెద్ద ప్రభుత్వ ప్రాజెక్టులను పొందే అవకాశం ఉంది. ఈ సమయం ఉద్యోగం ప్రశాంతంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర మద్దతు పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇది కుంభరాశి వారికి అదృష్ట కాలం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications