అదృష్టవంతులు... ఈ రాశులకు భారీగా సంపదను ఇవ్వబోతున్న కేతువు
నవగ్రహాల్లో మంచి ఫలితాలు కలిగించేవి, ప్రతికూల ఫలితాలను కలిగించేవి ఉంటాయి. అయితే ప్రతికూల ఫలితాలను కలిగించే గ్రహాలు కూడా ఒక్కోసారి ఊహించనిరీతిలో ధనలాభాన్ని కలిగిస్తుంటాయి. ఆ కోవకు చెందినదే కేతువు. కేతువు ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది. తాజాగా అది సింహరాశిలోకి ప్రవేశించనుంది. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితాలు పూర్తిగా మారిపోనున్నాయని, వారి జీవితం చాలా అద్భుతంగా ఉండబోతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవడంతోపాటు పూర్తి ఆరోగ్యం చేకూరుతుందని చెబుతున్నారు. ఏయే రాశులకు ఎలా కలిసిరానుందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
తులారాశి
వ్యాపారస్తులు వారు కూడా ఊహించనిరీతిలో లాభాలను పొందనున్నారు. వీరి కెరీర్ అద్భుతంగా ఉండనుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం రెట్టింపు అవుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. అందుకు బాగా కష్టపడతారు. రుణ సమస్యలన్నీ తీరిపోవడంతో మానసికంగా ఎంతో ప్రశాంతంగా జీవిస్తారు. శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి కేతువును పూజించడంద్వారా మంచి ఫలితాలను పొందుతారు.

మేష రాశి
ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. వీరికి సంపద భారీగా పెరుగుతుంది. వీరు ఏ పని తలపెట్టినా మంచి లాభాలను అందుకుంటారు. కెరీర్ పరంగా ఇప్పటివరకు ఎదురవుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఒకరకంగా వీరికి అద్భుత లాభాలున్నాయని చెప్పొచ్చు. ఈ రాశివారు ఎంత కష్టపడితే అంత ఫలితాన్ని, అంత సంపదను సంపాదిస్తారు. అందుకు అదృష్టం కూడా తోడుంటుంది.
కన్యారాశి
ఉద్యోగస్థులు వేతనాలు భారీగా పెరగడంతోపాటు ప్రమోషన్స్ ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. అందుకు ఎదురయ్యే అడ్డంకులన్నీ సులభంగా అధిగమిస్తారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులన్నీ ఈ సమయంలో పూర్తిచేయగులుగతారు. దగ్గరలోని ఆలయంలో నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది.












Click it and Unblock the Notifications