ఫిబ్రవరిలో 4 రాశులకు ఊహించని డబ్బు .. వీరికి కేతువు క్రూరగ్రహం కాదండోయ్!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నవగ్రహాలలో కేతువును క్రూర గ్రహంగా పరిగణిస్తారు. సహజంగా కేతువును చెడు చేసే గ్రహంగా చెప్తారు. జాతకంలో కేతువు బలమైన స్థానంలో ఉంటే ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయని బలహీనంగా ఉంటే తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కోవలసి వస్తుందని కూడా చెబుతారు.
ఫిబ్రవరి మాసంలో కేతువు సంచారం
ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో కేతువు సంచారం కొన్ని రాశుల వారికి బలమైన స్థానంలో సంచరించడం వల్ల అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల నాలుగు రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
ఫిబ్రవరి నెలలో కేతువు ప్రభావంతో వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు సమాజంలో గౌరవం పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. ఎప్పటినుంచో వసూలు కావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థికంగా అనేక ప్రయోజనాలు ఉంటాయి.
సింహరాశి
ఫిబ్రవరిలో కేతు సంచారం కారణంగా సింహరాశి జాతకులు లబ్ధిని పొందుతున్నారు. సింహ రాశి వారు ఈ సమయంలో చేపట్టిన పనులన్నీ విజయవంతంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సింహరాశి వారి ఆర్థికస్థితి మెరుగు పడుతుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది.
ధనుస్సు రాశి
ఫిబ్రవరి నెలలో కేతువు సంచారంతో ధనుస్సు రాశి వారు అనేక ప్రయోజనాలను పొందుతారు. ధనుస్సు రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు ఈ సమయంలో వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మకర రాశి
ఫిబ్రవరి నెలలో కేతువు సంచారం కారణంగా మకర రాశి వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఫిబ్రవరి నెలలో కేతువు సంచారం కారణంగా మకర రాశి వారి ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. సీనియర్లు, జూనియర్ల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications