Ketu gochar: జులై 8నుండి ఈ రాశులవారికి కష్టాలు కలిగించే కేతువు!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాల రాశీగమనంతో పాటు నక్షత్ర సంచారం కూడా రాశుల వారికి సానుకూల లేదా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఇక ప్రస్తుతం కేతువు కన్యారాశిలో ఉన్నాడు. ఈ ఏడాది మొత్తం కేతువు కన్యరాశిలోనే సంచరిస్తాడు. అయితే కేతువు నక్షత్ర సంచారం ఈసారి కొన్ని రాశుల వారికి శుభప్రదంగాను కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది.

హస్తా నక్షత్రంలోకి కేతువు
జూలై 8వ తేదీన కేతువు హస్తా నక్షత్రంలోనికి ప్రవేశిస్తారు. ఎప్పుడూ తిరోగమన దిశలోనే ప్రయాణించే కేతువు నక్షత్రసంచారం కారణంగా ముఖ్యంగా మూడు రాశులవారి జీవితంపైన ఒత్తిడి పెరుగుతుంది. జులై 8వ తేదీన కేతువు హస్తా నక్షత్రంలో ప్రవేశించి హస్తా నక్షత్రంలో ద్వితీయ స్థానంలో ఉంటాడు. సెప్టెంబర్ 8వ తేదీ తర్వాత హస్తా నక్షత్రం మొదటి స్థానంలో సంచరిస్తాడు. కేతువు హస్తా నక్షత్రసంచారం కారణంగా కష్టాలను ఎదుర్కోబోయే రాశుల గురించి తెలుసుకుందాం.

Ketu transit in Hasta Nakshatra difficulties for these zodiac signs

తులారాశి
హస్తా నక్షత్రం రెండవ స్థానంలో కేతువు సంచారం కారణంగా తులారాశి జాతకులకు ఇబ్బందులు వస్తాయి. ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. జీవితంలో ఊహించని కష్టాలను, సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. పనులు పూర్తి చేయడంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. తులా రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టాలి.

కన్యా రాశి
కేతువు నక్షత్ర సంచారం కన్యా రాశి వారికి నష్టాలను కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. మితిమీరిన ఖర్చు కారణంగా అనవసరమైన టెన్షన్లు పడవలసి వస్తుంది. ఈ సమయంలో కన్యారాశి జాతకులు ఉద్యోగం చేసే సహోద్యోగుల తోటి వాదోపవాదాలకు దిగే అవకాశం ఉంది. అనవసరమైన ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉన్న కారణంగా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి
కేతువు నక్షత్ర సంచారం కర్కాటక రాశి జాతకులకు కష్టాలకు కారణమవుతుంది. ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులను కర్కాటక రాశి జాతకులు ఎదుర్కొంటారు. ఏ పని చేసినా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా క్షీణించే ప్రమాదం ఉంది.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+