Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గ్రహాలకు ఆగ్రహం కలిగించే అంశాలు: ఆ గ్రహం కోప్పడితే మీ బతుకు మటాషే..!!

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

1. చంద్రుడు :- అద్దం పుట్టడానికి చంద్రుడు కారణమట. అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.

2. గురువు :- సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుందట.

Know the issues that make the planets angry.

3. బుధుడు :- బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపమట. అందునా బుధవారం అస్సలు చేయకూడదట. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన, జ్ఞానం ఉంది అని విర్రవీగిన కోపమట.

4. శని :- శనికి పెద్దల్ని కించపరచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపమట. తల్లితండ్రిని చులకన చేసిన కోపమట. సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.

5. సూర్యుడు :- పితృ దేవతలని దూషిస్తే రవికి కోపమట. సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట.

6. శుక్రుడు :- శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపమట. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరుట, గొడవలు లేని ఇల్లు ఇష్టము.

7. కుజుడు :- అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపమట. వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడట.

8.కేతువు :- జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన, మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపమట. ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.

9. రాహువు :- రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగునట. ఈయన భ్రమ మాయకి కారణము.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+