దీపావళి కాసుల వర్షం కురిపించాలంటే ఏ దిశలో ఏ రంగుల లైట్లు పెట్టాలో తెలుసా!

దీపావళి అనేది హిందూ సమాజం అత్యంత పవిత్రంగా జరుపుకునే ప్రత్యేకమైన మరియు ఆహ్లాదకరమైన పండుగ. ఈ పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ సంవత్సరం దీపావళి రెండు రోజులూ అమావాస్య ఘడియలు ఉండటంతో ఎప్పుడు జరుపుకోవాలి అని అందరూ సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఉదయం ఉన్న తిధినే ప్రామాణికం కావటంతో నవంబర్ 1 వతేదీన దీపావళి పండుగ జరుపుకోవాలని చెప్తున్నారు పండితులు.

దీపావళి వాస్తు చిట్కాలు
దీపావళి దీప కాంతుల పండుగ. వెలుగుల పండుగ . ఈ రోజున, ప్రజలు తమ జీవితాల్లో ఆనందం మరియు వెలుగులు నిండాలని, సంతోషంగా ఉండాలని తమ తమ ఇళ్ళ వద్ద దీపాలను వెలిగిస్తారు. కానీ ఈ దీపాలను వెలిగించేటప్పుడు, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళి నాడు దీపాలు పెట్టే సమయంలో ఉత్తమమైన ప్రదేశాలను తెలుసుకోవడం ముఖ్యం. ఇది మన ఇళ్లకు శుభాలను కలిగిస్తుంది.

Know which direction which color lights are auspicious and gives wealth on Diwali

దీపావళి లైట్లు ఏ దిశలో ఉండాలంటే
దీపావళికి మీ ఇంటిని రంగు రంగుల లైట్లతో, దీప కాంతులతో నింపాలి అని భావించేవారు ఇంటిలో లైట్లను ఏ దిశలో పెట్టాలో తెలుసుకోవటం చాలా ముఖ్యం. దీపావళికి మీ ఇంటిని అందంగా కనిపించేలా చేయడానికి మీరు అందమైన ఫెయిరీ లైట్లు, రంగురంగుల బల్బులు మరియు ఫ్యాన్సీ ల్యాంప్‌లను ఉపయోగించవచ్చు.

తూర్పు, పడమర ఈ రంగుల దీపాలు పెడితే మంచిది
దీపావళి వాస్తు ప్రకారం, మీ ఇంట్లోని వివిధ భాగాలలో కొన్ని రంగుల లైట్లను ఉపయోగించడం మంచిది. ఉదాహరణకు, మీరు మీ ఇంటి తూర్పు భాగంలో ఎరుపు, పసుపు లేదా నారింజ దీపాలను ఉంచినట్లయితే, అది పండుగకు చాలా అదృష్టంగా పరిగణించబడుతుంది. మీరు మీ గది అందంగా కనిపించాలంటే, శుభాలు జరగాలంటే పసుపు, నారింజ మరియు గులాబీ రంగు లైట్లను పశ్చిమం వైపు వేలాడదీయడం మంచిది.

ఉత్తర, దక్షిణ దిశల్లో ఈ రంగుల లైట్లు బెస్ట్
ఇక దక్షిణం వైపు, తెలుపు, ఊదా మరియు ఎరుపు లైట్లు ఉత్తమం. నీలం, పసుపు మరియు ఆకుపచ్చ దీపాలను ఉత్తర దిశలో పెడితే ఎంతో మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీపావళి పండుగలో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఇంటిని దీప కాంతులతో నింపితే ఎంతో మేలు జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+