Koti Deepothsavam: కార్తీక మాసం... కైవల్య ధామం

న కార్తీక సమో మాసో న శాస్త్రం నిగమాత్పరం
నారోగ్య సమముత్సాహం న దేవః కేశవాత్పరః
కార్తికంతో సమానమైన మాసంకానీ, వేదంకంటే అన్యమైన శాస్త్రం కానీ, ఆరోగ్యంతో సమానమైన ఉత్సాహం కానీ, కేశవునికంటే అన్యమైన దైవంగానీ లేవని భావం! ఈ మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమే.

ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. స్కాంద పురాణంలో కార్తీక మాస విశిష్టత ప్రత్యేకంగా ఉంది. పూర్వ కాలంలో నారద మహర్షి భూలోకంపై మిక్కిలి వాత్సల్యం కలిగి బ్రహ్మను స్తుతించాడు. సంవత్సరంలో ఏ మాసం ఉత్తమమైనది, ఈ మాసంలో పూజింప వలసిన దైవం ఎవరు, దర్శించవలసిన ఉత్తమ తీర్ధం ఏదో చెప్పమని కోరాడు. అత్యంత విశిష్టమైన మాసం కార్తిక మాసం.. పూజించ వలసిన దైవాలు శివకేశవులు.. శివకేశవులకిద్దరికి ఇది ఎంతో ప్రీతీ పాత్రమైన మాసం.. దర్శించ వలసిన తీర్ధం బదరీ క్షేత్రమని బ్రహ్మ వివరించాడు.

Koti Deepothsavam:A Divine Celebration Lighting Up Hyderabad from November 14th to 27th

హైదరాబాద్ ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ప్రముఖ మీడియా అధినేత తుమ్మల నరేంద్రచౌదరి, రమాదేవి దంపతులు ప్రతి ఏడాది కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నారు. సంప్రదాయబద్ధంగా పూజలు, కల్యాణాలు, ఊరేగింపుల్లో ఎవరికీ ఏలోటూ లేకుండా సాగుతుంది. కోటి దీపోత్సవం ముగించేరోజునే వచ్చే కోటి దీపోత్సవానికి ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది. కోటి దీపోత్సవం చాలా ఖర్చుతో కూడుకున్నది. నవంబర్ 14వ తేది నుంచి 27 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పూజలన్నీ జరుగుతాయి.

కోటి దీపోత్సవ ప్రాంగణంలో జరగని పూజలేదు, నిర్వహించని కల్యాణం లేదంటే అతిశయోక్తి కాదు. వేదికపై పూజలు జరుగుతాయి. అంతేకాదు.. భక్తులే నిర్వహించుకునే పూజలుంటాయి.. ప్రతిరోజూ స్వామివార్ల కల్యాణాలుంటాయి. ప్రసిద్ధిచెందిన అన్నిదేవాలయాల నుంచి దేవుళ్లంతా తరలివస్తారు. సహస్ర కలశాభిషేకాలు, కోటి మల్లెల అర్చనలు, సుమంగళీపూజలు, గణపతికి గరిక అర్చన, శివలింగాలకు భస్మార్చన, పార్థివలింగానికి భస్మార్చన, అమ్మవారికి కోటిగాజుల అర్చన, తులసి దళార్చన, కోటి బిల్వార్చన, నాగ ప్రతిమలకు రాహుకేతుపూజలు, సత్యనారాయణస్వామి వ్రతం, కోటి కుంకుమార్చనలు, రుద్రాక్షల అర్చన, ముడుపుల పూజలు...ఇలా ఒకటేమిటి...భక్తులు కోరుకున్న అన్నిపూజల్లో పాలుపంచుకోవచ్చు.. దేవుళ్లందరి కల్యాణాలు కళ్లారా వీక్షించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+