క్రోధి నామ ఉగాది పంచాంగం: కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం; అంతా కష్టాలమయం!!

క్రోధి నామ సంవత్సరంలో కుంభ రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది? కుంభరాశి వారి ఆదాయ వ్యయాలు ఎంత? ఈ సంవత్సరం వీరికి ఏ రంగాలలో కలిసి వస్తుంది? ఏ రంగాల వారికి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది? వంటి వివరాలను ప్రస్తుతం మనం ఉగాది పంచాంగం ఆధారంగా తెలుసుకుందాం.

Krodhi Nama Ugadi Panchangam aquarius to face difficulties in this year
వారి ఆదాయ వ్యయాలిలా
క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారి ఆదాయం 14, వ్యయం 14 గా ఉంటుంది. రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంటుంది. కుంభ రాశి వారికి బృహస్పతి నాలుగవ స్థానమందు, శని జన్మరాశి స్థానమందు, రాహువు వాక్ స్థానము నందు, కేతువు అష్టమ స్థానము నందు సంచరించడం వల్ల గోచార పరంగా ఈ సంవత్సరం కుంభ రాశి వారికి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

కుంభరాశి జాతకులపై ఏలినాటి శని ప్రభావం
కుంభ రాశి జాతకులకు ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. ఈ సంవత్సరం ముఖ్య గ్రహాల స్థానాల వల్ల కుంభరాశి జాతకులు వివాదాలు, గొడవలు, చిరాకులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. కుంభ రాశి వారు ప్రశాంతంగా ఉండాలని సూచించబడింది. అయితే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని గుర్తుంచుకోవాలి.

ఆర్థికపరంగా
ఈ సంవత్సరం కుంభ రాశి జాతకులకు ఆర్థికపరంగా ఒడిదుడుకులు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే అప్పుల బాధలు ఉన్నప్పటికీ కుంభరాశి జాతకులకు చతుర్దంలో గురువు అనుకూలంగా ఉండటం వలన ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. అయితే వర్తక వ్యాపారాలలో అనుకున్న ఫలితాలు సాధించలేరు.

కుటుంబ పరంగా
కుంభ రాశి వారి కుటుంబ జీవితం ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామితో కుంభ రాశి జాతకులు సంతోషంగా గడుపుతారు. ప్రేమపరమైన విషయాలలో మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. అవివాహితులకు వివాహం అయ్యే యోగం ఉన్నది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.

కెరీర్ పరంగా
కుంభ రాశి వారికి ఈ సంవత్సరం కెరీర్ పరంగా మార్పు తీసుకువచ్చే సంవత్సరం. కుంభరాశి జాతకుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు అనుకూలంగా ఉంటాయి.బదిలీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. సినీ మీడియా రంగాల వారికి కాస్త కష్ట కాలమని చెప్పాలి. రైతులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఉద్యోగాల్లో గొడవలు అధికంగా ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.

ఆరోగ్యపరంగా
కుంభ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం కోసం కుంభరాశి జాతకులు ఈ సంవత్సరం విపరీతంగా డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంది. చతుర్థంలో గురువు ఉండడం వల్ల కొంతమేరకు ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది. గత కొంతకాలంగా ఉన్న అనారోగ్య సమస్యల నుంచి బయటకు వస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+