క్రోధి నామ ఉగాది పంచాంగం: తులారాశి వారికి ఆదాయాన్ని మించిన ఖర్చులు.. జాగ్రత్త!!
క్రోధి నామ తెలుగు సంవత్సరంలో తులా రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది? వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం వారికి ఏ అంశాలలో కలిసి వస్తుంది? ఏ అంశాలలో జాగ్రత్తగా ఉండాలి? వంటి అనేక వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
తులారాశి వారి ఆదాయ వ్యయాలిలా
తులా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2 వ్యయం 8 గా, రాజపూజ్యం 1, అవమానం 5 గా ఉంది. తులారాశిలో ఈ సంవత్సరం బృహస్పతి ఎనిమిదవ స్థానంలో, శని ఐదవ స్థానంలో, కేతువు వ్యయ స్థానంలో, రాహువు ఆరవ స్థానంలో సంచరించడం వల్ల అనుకూల ఫలితాలు కంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం తులారాశి జాతకులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఆర్థికపరంగా
ఆర్థికపరంగా తులా రాశి జాతకులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఈ సంవత్సరం వీరికి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం కోసం సంపాదించిన దాంట్లో ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉండదు. అనవసరపు ఖర్చుల విషయంలో ఈ ఏడాది జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ పరంగా
తులా రాశి జాతకులకు కుటుంబ పరంగా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఎక్కువవుతాయి. అయితే ఈ సంవత్సరం గ్రహాల స్థితి వల్ల ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో తులా రాశి జాతకులు గొడవలకు దూరంగా ఉండాలని సూచించబడింది.
కెరీర్ పరంగా
కెరీర్ పరంగా తులా రాశి జాతకులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అష్టమంలో గురువు ఉండడం వల్ల తులారాశి జాతకులు ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. రాజకీయ ఒత్తిళ్లు, సమస్యలు అధికంగా మారుతాయి. విపరీతమైన శ్రమతో ఉద్యోగంలో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. వర్తక, వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది.
ఆరోగ్యపరంగా
ఆరోగ్యపరంగా తులా రాశి జాతకులు ఈ సంవత్సరం తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. కనుక ఆరోగ్యం విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. అష్టమంలో గురువు ఉండడం వల్ల తులా రాశి జాతకులు ఈ సంవత్సరం ఆరోగ్య నష్టాలను చూడాల్సి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications