Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

క్రోధి నామ ఉగాది పంచాంగం: మిధునరాశి వారికి విశేష యోగాలతో విలాసవంతమైన జీవితం!!

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మిధున రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది? వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి? ఈ తెలుగు సంవత్సరం మిధున రాశి వారికి కలిసి వస్తుందా లేదా? వంటి వివరాలను, క్రోధి నామ సంవత్సర పంచాంగం ప్రకారం ఆర్థికపరంగా, కుటుంబ జీవిత పరంగా, ఆరోగ్యపరంగా, మిధున రాశి జాతకులకు ఏ విధంగా ఉంటుంది అన్న వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి వారి ఆదాయ వ్యయాలిలా
ఈ సంవత్సరం మిధున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5 గా ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 6 గా ఉంటుంది. మిధున రాశి జాతకులకు గురుడు లాభ స్థానంలో, శని భాగ్య స్థానంలో, రాహువు రాజ్యస్థానంలో, కేతువు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నారు. ఫలితంగా ఈ సంవత్సరం మిధున రాశి జాతకులకు ఈ ఏడాది బాగానే ఉంది. గత సంవత్సరం కంటే విశేషమైన యోగాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారు.

Krodhi Nama Ugadi Panchangam Luxurious life with special yogas for Gemini

ఆర్థికపరంగా
ఆర్థికంగా మిధునరాశి జాతకులు ఈ సంవత్సరం పరవాలేదనే చెప్పాలి. మీ ఆర్ధిక పరిస్థితి ఈ ఏడాది మెరుగుపడుతుంది. అప్రయత్న ధనలాభం కలుగుతుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇతర ఆదాయ వనరుల కోసం వెతకాల్సి వస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి.

కుటుంబ పరంగా
కుటుంబ పరంగా చూస్తే మిధున రాశి వారికి ఈ సమయం సత్ఫలితాలను ఇస్తుంది. మీ కుటుంబ సంబంధాలు ఉగాది తర్వాత బలపడతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరమైన మానసిక మద్దతు లభిస్తుంది. ఈ సంవత్సరం కుటుంబవాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అవివాహితులకు ఈ సంవత్సరం వివాహయోగం ఉంది. అయితే వివాహ ప్రణాళికలో జాప్యం జరిగినా, కాస్త ఓపికతో ఎదురుచూడాల్సిన అవసరం ఉంది.

కెరీర్ పరంగా
కెరీర్ పరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మిధున రాశి జాతకులకు మంచి పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు కార్యాలయాలలో గుర్తింపు పొందుతారు. మీ కెరీర్లో కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. అయితే ఈ సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.

విద్యాపరంగా
మిధున రాశి జాతకులకు విద్యాపరంగా సానుకూల ఫలితాలు వస్తాయి. మీలోని నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కొత్త కోర్సులు, వర్క్ షాపులు, శిక్షణ కార్యక్రమాలలో మిధున రాశి జాతకులు పాల్గొంటారు. ఈ సమయంలో అన్ని కోర్సులలోను బాగా రాణిస్తారు. ఈ సంవత్సరం విదేశాలలో చదువుకోవాలి అనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.

ఆరోగ్యపరంగా
మిధున రాశి వారికి ఆరోగ్యపరంగా కూడా ఈసారి బాగానే ఉంటుంది. అయితే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం మంచిది కాదు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. మానసిక ఆరోగ్యం పై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఈ సంవత్సరం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+