క్రోధి నామ ఉగాది పంచాంగం: మీనరాశి వారికి ధనవ్యయంతో పాటు ఈ సమస్యలు కూడా!!

క్రోధి నామ సంవత్సరంలో మీన రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది? మీనరాశి వారి ఆదాయ వ్యయాలు ఎంత? ఈ సంవత్సరం వీరికి ఏ రంగాలలో కలిసి వస్తుంది? ఏ రంగాల వారికి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది? వంటి వివరాలను ప్రస్తుతం మనం ఉగాది పంచాంగం ఆధారంగా తెలుసుకుందాం.

మీనరాశి వారి ఆదాయ వ్యయాలిలా
క్రోధి నామ సంవత్సరంలో మీనరాశి వారి ఆదాయం 11, వ్యయం 5గా ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంటుంది. మీన రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి మూడవ స్థానంలో, శని వ్యయ స్థానంలో సంచరిస్తున్నారు. జన్మరాశిలో రాహువు, కళత్ర స్థానంలో కేతువు సంచరించడం వల్ల, అంతేకాకుండా ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ రాశి జాతకులకు చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

Krodhi Nama Ugadi Panchangam Pisces have these problems along with money this year

మీనరాశి జాతకులకు అననుకూల వాతావరణం
మీనరాశి జాతకులకు ఉద్యోగాలు చేసే వారికి చిరాకులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, విపరీతమైన ఖర్చులు ఈ సంవత్సరం ఇబ్బంది పెడతాయి. ఈ సంవత్సరం కోర్టు వ్యవహారాలు వీరిని చిరాకు పెడతాయి. ఈ సంవత్సరం అననుకూల వాతావరణం ఉండటం వలన నష్టాలు, కష్టాలు కలుగుతాయి.

ఆర్థికపరంగా
ఆర్థికపరంగా మీనరాశి జాతకులకు అంత అనుకూలంగా లేదు. అప్పుల బాధలు విపరీతంగా పెరుగుతాయి. విపరీతమైన ధన నష్టం కలుగుతుంది. ఈ సమయంలో మీన రాశి వారు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. అప్పుగా తీసుకోకూడదు. ఈ సంవత్సరం ఖర్చులు తగ్గించుకుని ఆర్థిక విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలి.

కుటుంబ పరంగా
మీన రాశి వారు కుటుంబ వ్యవహారాలలో ఈ సంవత్సరం ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ సంవత్సరం ప్రేమ వ్యవహారాలకు అంత అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు వస్తాయి. వాదనలతో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ సంవత్సరం మీన రాశి జాతకులు జీవితంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. స్త్రీలు భగవన్నామస్మరణలో ఉండడం మంచిది.

కెరీర్ పరంగా
మీన రాశి జాతకులకు ఈ సంవత్సరం కెరీర్ పరంగా మధ్యస్థంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరకడం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు, పని ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. ఈ సంవత్సరం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు గురించి ఆలోచించకుండా ఉంటేనే మంచిది.

ఆరోగ్యపరంగా
మీన రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అంతా అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలు ఈ సంవత్సరంలో మీకు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవలసిన అవసరం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+