క్రోధి నామ ఉగాది పంచాంగం: ధనుస్సురాశి వారికి శత్రుపీడ, ధనవ్యయం జాగ్రత్త!!
ధనుస్సు రాశి వారికి క్రోధి నామ సంవత్సరం ఏవిధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి జాతకుల ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి? వీరికి ఏ రంగంలో కలిసొస్తుంది? ఏ రంగంలో వీరు ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది? వంటి అనేక వివరాలను ఉగాది పంచాంగం ఆధారంగా తెలుసుకుందాం.
ధనుస్సు రాశి వారి ఆదాయ వ్యయాలిలా
క్రోధి నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం 11 వ్యయం 6, రాజపూజ్యం 4 అవమానం 5 గా ఉంది. క్రోధి నామ సంవత్సరంలో ధనుస్సు రాశిలో మూడవ స్థానంలో శని, స్థానంలో, పదవ స్థానంలో కేతువు, ఒకటవ స్థానంలో రాహువు ఉన్నారు. బృహస్పతి ఆరవ స్థానంలో సంచరిస్తున్నారు.

ధనుస్సు రాశి జాతకుల జాతకం ఇలా
ఇక ముఖ్య గ్రహాలు ధనుస్సు రాశిలో సంచరించే స్థానాలను బట్టి ధనుస్సు రాశి వారి జాతక ఫలితాలు ఉన్నాయి. వీరికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం రైతాంగానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటే, మీడియా సినీ రంగాల వారికి ఫలితాలు మధ్యస్థంగా కనిపిస్తున్నాయి.
ఆర్థికపరంగా
ధనస్సు రాశి వారి ఆర్థిక భవితవ్యం సంవత్సరం మధ్యస్థంగా ఉంది. వర్తక వ్యాపారాలు చేసే వారు ఆశించిన మేర లాభాలను పొందలేరు. ఈ సంవత్సరం ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ధన వ్యయం అధికంగా ఉండటం వల్ల ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. ధనుస్సు రాశి జాతకులు ఈ సంవత్సరం ఖర్చులను కంట్రోల్ చేసుకోవాల్సిందిగా సూచన.
కుటుంబ పరంగా
ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా కూడా ప్రతికూలమైన పరిస్థితులే ఉన్నాయి. జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేమ పరమైన అంశాలు అనుకూలించవు. ప్రేమ వ్యవహారాల్లో ఆవేశపూరితమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లతో ఇబ్బంది పడతారు. కుటుంబ పరంగాను అనేక సమస్యలను ఎదుర్కొంటారు.
కెరీర్ పరంగా
ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగ పరంగా మిశ్రమ పరిస్థితులు ఉన్నాయి. ఎంతోకాలంగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగం చేసే వారికి కెరీర్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ సంవత్సరం ద్వితీయార్ధం ధనస్సు రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది.
ఆరోగ్యపరంగా
ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో పురోగతి కనిపిస్తుంది. అయితే టెన్షన్ లకు ఒత్తిళ్లకు దూరంగా ఉండాలని సలహా ఇవ్వబడింది. ఈ సంవత్సరం ధనుస్సు రాశి జాతకులకు శత్రుపీడ, నర ఘోష ఇబ్బంది కలిగిస్తాయి. ఇవి మానసిక సమస్యలకు కారణమవుతాయి. కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తూ శత్రువులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు! -
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే! -
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..!












Click it and Unblock the Notifications