క్రోధి నామ ఉగాది పంచాంగం: మకరరాశి వారికి ఈ ఏడాది బ్రహ్మాండం!!

క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుంది. మకర రాశి వారి ఆదాయ వ్యయాలు ఎంత? మకర రాశి వారికి ఏ రంగంలో కలిసి వస్తుంది? ఏ రంగంలో ఇబ్బంది ఉంటుంది? వంటి అనేక అంశాలను ఉగాది పంచాంగం ఆధారంగా తెలుసుకుందాం.

మకరరాశి జాతకుల ఆదాయ వ్యయాలిలా
మకర రాశి జాతకులకు ఆదాయం 14 వ్యయం 14 గా ఉంది. రాజపూజ్యం 3 అవమానం 6 గా ఉంది. మకర రాశిలో ఈ సంవత్సరం బృహస్పతి ఐదవ స్థానంలో, శని రెండవ స్థానంలో, రాహువు మూడవ స్థానంలో సంచరిస్తున్నారు. కేతువు భాగ్య స్థానంలో సంచరిస్తున్నారు.

Krodhi Nama Ugadi Panchangam This year is awesome for Capricorn

మకరరాశి జాతకులకు ఈ ఏడాది బ్రహ్మాండం
బృహస్పతి పంచమ స్థానంలో సంచరించడం వల్ల, తృతీయంలో ఉన్న రాహువు కూడా అనుకూలించడం వల్ల మకర రాశి వారికి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగుల అనుకూల వాతావరణంతో పాటు, గతంతో పోల్చుకుంటే వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది.

ఆర్థికపరంగా
ఆర్థికపరమైన ఇబ్బందులు నుండి మకర రాశి జాతకులు ఈ సంవత్సరం బయటపడతారు. అయితే ఏలినాటి శని ప్రభావంతో అప్పుల బాధలు అధికంగా ఉన్నప్పటికీ, బృహస్పతి పంచమంలో ఉండడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా కొంత పురోగతి కనిపిస్తుంది. ఈ సంవత్సరం దైవారాధన చేయడం వల్ల మకర రాశి వారు ఆర్థిక పరంగా శుభ ఫలితాలను పొందుతారు.

కుటుంబ పరంగా
కుటుంబ పరంగా మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం సానుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రేమ విషయంలో మకర రాశి జాతకులకు అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలు సత్ఫలితాలను ఇస్తాయి. విదేశీప్రయాణాలు చేయాలనుకునే కుటుంబ సభ్యులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది.

కెరీర్ పరంగా
మకర రాశి జాతకులు ఈ సంవత్సరం ఉద్యోగ పరంగాను ఉత్తమ ఫలితాలను చూస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి ధన లాభం, ప్రమోషన్లు కలుగుతాయి, సినీ, మీడియా రంగాల వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. గత కొంతకాలంగా ఉద్యోగంలో ఉన్న అనేక సమస్యలు తొలగి ప్రమోషన్లు వస్తాయి.

ఆరోగ్యపరంగా
మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా పురోగతి కనిపిస్తుంది. పెద్దగా అనారోగ్య సమస్యలు వేధించవు. పంచమంలో గురు గ్రహ అనుకూలత వల్ల చాలా కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యంతో పాటు సౌఖ్యం, సంతోషం రెండు ఉంటాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+