జనవరి 12 వరకు ఈ రాశులకు తీవ్ర హెచ్చరిక చేసిన కుజ మంగళ దోషం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహానికి ప్రధానమైన స్థానమే ఉంది. అక్టోబర్ 21 తేదీ నుండి జనవరి 12వ తేదీ వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో కుజ సంచారం కొనసాగుతుంది. అయితే నీచ కుజుడు కారణంగా కొన్ని రాశుల వారి పైన కుజదోష ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మేషం, మిధున, కర్కాటక, సింహ, ధనుస్సు, మకర రాశి వారిపై కుజదోష ప్రభావం పడుతుంది.

కుజుడి మంగళ దోషం
ఈ కుజదోషాన్ని మంగళ దోషమని అంటారు. కుజుడు ఏ రాశిలోనైనా సరే ఒకటి, రెండు, నాలుగు, ఏడు, ఎనిమిది, 12 స్థానాలలో సంచారం చేస్తున్నప్పుడు కుజదోషం ఏర్పడుతుంది. ఈ కుజదోషం కారణంగా ఇబ్బంది పడే రాశులు ఎటువంటి కష్టాలని ఎదుర్కోబోతున్నారు తెలుసుకుందాం.

Kuja Mangal Dosha has warned worst phase to these zodiac signs until January 12th 2025

మేషరాశి
మేషరాశిలో కుజుడు చతుర్థ స్థానంలో నీచత్వాన్ని పొందుతున్నందున మేష రాశి వారికి కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది. జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి. వృత్తి వ్యాపారాలలోనూ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. కుటుంబంలో సమస్యలను జాగ్రత్తగా చక్కదిద్దుకోవలసిన అవసరం ఉంది.

మిధున రాశి
మిధున రాశిలో కుటుంబ స్థానంలో కుజ దోషం ఏర్పడుతున్న కారణంగా జీవిత భాగస్వాముల మధ్య అపార్థాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు చిక్కులను తెచ్చి పెడతాయి. ఈ సమయంలో ఓర్పు, సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కుటుంబ వ్యవహారాలలోనూ, దాంపత్య జీవితంలోనూ జాగ్రత్తగా వ్యవహరించకుంటే నష్టం జరుగుతుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కుజ సంచారం సమయంలో ఏర్పడుతున్న కుజదోషం కారణంగా ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో గొడవలు వస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహరాశి
మంగళ దోషం కారణంగా సింహ రాశి వారికి జీవిత భాగస్వామితో ఎడబాటు కలిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. దంపతుల్లో ఒకరు బదిలీ కావడం లేదా అకారణంగా దూరం కావడం జరుగుతుంది. బంధువుల కారణంగా కుటుంబ కలహాలు చోటుచేసుకుంటాయి. కుటుంబంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. కోపతాపాలు, అసహనం పెరుగుతాయి.

మకర రాశి
మకర రాశిలో సప్తమ స్థానంలో కుజసంచారం కారణంగా కుటుంబంలో టెన్షన్లు, మానసిక ఒత్తిళ్లు ఉంటాయి. జీవిత భాగస్వామితో ఘర్షణ చోటు చేసుకుంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కారణంగా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

ధనుస్సు రాశి
ధనస్సురాశిలో అష్టమ స్థానంలో కుజ సంచారం చేయడం వల్ల మంగళ దోషం ఏర్పడుతుంది. దీనివల్ల ధనుస్సురాశి దంపతులకు జీవితంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు బాగా పెరిగే ప్రమాదం ఉంది. కోపాన్ని కంట్రోల్ లో పెట్టుకోవడం చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాల వల్ల కుటుంబాలే చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+