ఏప్రిల్ లో కుజ పుష్య యోగంతో ఏనుగు కుంభస్థలాన్ని బద్దలుకొట్టే రాశులివే!

వేద జ్యోతిష్య శాస్త్రంలో ఏ గ్రహానికి ఆ గ్రహమే చాలా ప్రత్యేకమైనది. కుజ గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక గుర్తింపు ఉంది. కుజుడు పుష్య నక్షత్రాన్ని కలిపే జ్యోతిష్యం అమరిక త్వరలో జరగబోతోంది.ప్రస్తుతం కుజుడు పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు. ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6:30కు కుజుడు పుష్య నక్షత్రంలోకి వెళ్లి అరుదైన శక్తివంతమైన కుజ పుష్య యోగాన్ని ఏర్పరుస్తున్నాడు.

కుజ పుష్య యోగం
కుజ పుష్య యోగం వల్ల కొన్ని రాశుల వారికి శ్రేయస్సు, సంపదలు వస్తాయి. ఈ అరుదైన ఖగోళ యాధృచ్చికం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. అందుకే కుజ పుష్య యోగం కారణంగా లబ్ధిని పొందే ఆ అదృష్ట రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Kuja Pushya Yoga in april these zodiac signs will be millionaires

వృషభ రాశి
పుష్య నక్షత్రంలో కుజ సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు ప్రయోజనాలు చేకూరుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక విషయాలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగాలు చేసేవారి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. వ్యాపార ప్రయత్నాలు లాభదాయకంగా ఉంటాయి. దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను నిర్ధారించటానికి ఈ సమయం పనికి వస్తుంది. పుష్య నక్షత్రంలో కుజసంచారం కారణంగా వృషభ రాశి వారికి సంపద వస్తుంది. వ్యక్తిగత పురోగతి కలుగుతుంది.

కర్కాటక రాశి
కుజపుష్య యోగం కారణంగా కర్కాటక రాశిలో ఉన్నవారికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. కర్కాటక రాశిలో లగ్న గృహంలో కుజుడు ఉండడంతో ఈ సమయం వారికి కొత్త అవకాశాలను ఇస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి రాబడి వస్తుంది. ఈ సమయం శ్రేయస్సును, సంపదను ఇస్తుంది.

కన్యారాశి
కుజపుష్య యోగం కారణంగా కన్యారాశిలో జన్మించిన వారికి గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సమయంలో కన్యారాశి జాతకులు గణనీయమైన పురోగతిని చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. కన్యారాశి జాతకులు ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు. జీవితంలోని అనేక రంగాలలో సంపన్నమైన సంతృప్తికరమైన సమయాన్ని చూస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+