కుజ స్తంభన.. 2025 జనవరి 21వరకు ఈ రాశులవారికి సిరిసంపదల వాన!!
గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్న కుజుడు స్తంభన కొనసాగుతుంది. కుజుడు ఎటు కదలలేని పరిస్థితిలో స్తంభించిపోవడాన్ని కుజస్తంభన అంటారు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఈ కుజస్తంభన వచ్చే ఏడాది జనవరి 21వ తేదీ వరకు కొనసాగనుంది. కుజస్తంభన కారణంగా పలు రాశుల వారికి అదృష్టం కలగబోతుంది ధనయోగం, అధికార యోగాలతో వారు సంతోషంగా జీవించబోతున్నారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి జాతకంలో తృతీయ స్థానంలో ప్రస్తుతం కుజుడు స్తంభించిపోయాడు. దీని కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై పూర్వీకుల ఆస్తుల నుంచి లాభాలు వస్తాయి. ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు సాధిస్తారు. వర్తక, వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది.

కన్యారాశి
కన్యరాశిలో కుజుడు లాభ స్థానంలో స్తంభించిపోయాడు. దీని కారణంగా కన్యారాశి జాతకులకు అనేక విధాలుగా ఆదాయం సమకూరుతుంది. కన్య రాశి జాతకులకు ఈ సమయంలో నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమై ఇతరులకు సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు. అనారోగ్య సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కొందరు ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు లాభాలను కలిగిస్తాయి.
తులారాశి
కుజస్తంభన తులా రాశి వారికి లాభాలను ఇస్తుంది. తులా రాశిలో కుజుడు లాభ స్థానంలో స్తంభించిపోయాడు. దీని కారణంగా తులా రాశి వారికి అధికార యోగం పడుతుంది. ఉద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. విదేశాలలో ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఇది తులా రాశి వారికి మంచి టర్నింగ్ పీరియడ్.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో కుజుడు భాగ్యస్థానంలో స్తంభించిపోయాడు. దీని కారణంగా వృశ్చిక రాశి జాతకులకు సంపన్నయోగం కలుగుతుంది. ఈ రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. భూమి వివాదాలు పరిష్కారమై వీరికి అనుకూలమైన ఫలితం వస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.
కుంభరాశి
కుంభరాశిలో కుజుడు ఆరవ స్థానంలో స్తంభించడం కారణంగా కుంభ రాశి వారికి ఈ సమయంలో ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు శుభ ఫలితాలు వస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. ఈ సమయంలో కుంభరాశి జాతకులు శుభవార్తలు వింటారు.
మీనరాశి
మీన రాశి వారికి పంచమ స్థానంలో కుజుడు స్తంభించిపోయాడు. ఈ కారణం వల్ల మీన రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మీనరాశి జాతకులు ఏ పని చేపట్టిన విజయవంతం అవుతుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న కుటుంబ, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వివాహం కాని వారికి పెళ్లిళ్లు కుదురుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications