బుధుడు, శుక్రుడు కలయికతో లక్ష్మీనారాయణ యోగం త్వరలోనే.. ఈ రాశులవారు నక్క తోక తొక్కినట్టే!!

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశిలోకి బుధుడు సంచారం చేయడం వల్ల, అప్పటికే సింహ రాశిలో ఉన్న శుక్రుడుతో కలవడం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శుభయోగం. ఈ యోగం కారణంగా పలు రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. లక్ష్మీనారాయణ యోగం జులై 25 వ తేదీన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనున్న నేపథ్యంలో నక్క తోక తొక్కే అదృష్టరాశి జాతకులు ఎవరో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

లక్ష్మీనారాయణ యోగం వల్ల మేషరాశి జాతకులు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులు సీనియర్ అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారం చేసే వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. వ్యాపారస్తులు ఈ సమయంలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇది మంచి సమయంగా ఉంటుంది. ఏ రంగంలో పని చేసిన అద్భుతమైన ఫలితాలను పొందటానికి లక్ష్మీనారాయణ యోగంతో మేష రాశి జాతకులకు బాగుంటుంది.

Lakshmi narayana

లక్ష్మీనారాయణ యోగంతో మిధున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మిధున రాశి జాతకులకు సంపద వర్షం కురుస్తుంది. ఊహించని ధన లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ యోగం మిధున రాశి జాతకులకు సంబంధించిన డబ్బు అంశాలలో ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా వ్యాపార లావాదేవీలు, నూతన పెట్టుబడులు కలిసివస్తాయి.వృత్తి, వ్యాపారాలలో అపూర్వమైన అభివృద్ధిని చూస్తారు. కళలు, మీడియా రంగాల వారికి విజయం, సంపద మరియు కీర్తి లభిస్తుంది.

లక్ష్మీనారాయణ యోగం కారణంగా సింహరాశి జాతకులకు కలిసొస్తుంది. సింహరాశి జాతకుల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ సమయంలో వారు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది. లక్ష్మీనారాయణ యోగం కారణంగా వృశ్చికరాశి జాతకులకు కలిసొస్తుంది. వృశ్చికరాశి జాతకులు స్నేహితుల సహకారంతో మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. జీవితంలో అనేక రంగాలలో అనుకూలమైన మార్పులను చూస్తారు.

లక్ష్మీనారాయణ యోగం కారణంగా కుంభ రాశి జాతకులకు కలిసొస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల మన్ననలు దక్కుతాయి. వ్యాపారవేత్తలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీనారాయణ యోగం కారణంగా తులా రాశి జాతకులకు కలిసొస్తుంది. వీరు తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కష్టపడి పని చేసేవారు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఇది లాభదాయకంగా ఉండే సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+