వీరికి ఊహించనంత సంపద వృష్టి కురిపించనున్న లక్ష్మీనారాయణ రాజయోగం!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు సంయోగం చెందటం కొన్ని శుభ యోగాలను, కొన్ని అశుభ యోగాలను కలిగిస్తుంది. ఏప్రిల్ నెలలో మీనరాశిలో రెండు గ్రహాలు కలవడం కారణంగా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది .జనవరి 28వ తేదీన మీనరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మే 31వ తేదీ వరకు మీనరాశిలోనే సంచరిస్తాడు. ఇక ఫిబ్రవరి 27వ తేదీన మీన రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్లీ మే ఏడవ తేదీన మేష రాశిలోకి వెళతాడు.

లక్ష్మీ నారాయణ రాజయోగం
ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ నెలలో మీనరాశిలో శుక్రుడు, బుధుడు సంయోగం చెందడం వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ లక్ష్మీనారాయణ రాజయోగం ప్రభావం 69 రోజులపాటు ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Lakshminarayana Raja Yoga gives these zodiac signs golden life

మేషరాశి
మేష రాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. మేష రాశి వారి 12వ స్థానంలో ఈ రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మేష రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి .ఈ సమయంలో మీరు ఏ పని చేసిన అదృష్టం వెన్నంటే ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. సామాజికంగా గుర్తింపును పొందుతారు. ఇది మేష రాశి వారికి కలిసొచ్చే కాలం.

మిధున రాశి
మిధున రాశిలో పదవ స్థానంలో లక్ష్మీనారాయణ రాజయోగ ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా అదృష్టకరమైన ఫలితాలు వస్తాయి. మిధున రాశి వారికి యోగం కారణంగా సంపద పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. భూములు, ఇతర వ్యాపారాలు నుండి లాభాలు వస్తాయి. నిర్ణయాలు తీసుకోవడంలో నైపుణ్యం మెరుగుపడుతుంది.

కుంభరాశి
లక్ష్మీనారాయణ రాజ యోగం కుంభరాశి వారికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ యోగం కారణంగా కుంభరాశి జాతకులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. భూములు మరియు ఇతర వ్యాపారాల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

మీన రాశి
మీన రాశిలో లగ్న గృహంలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థికంగా లాభాలు వస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈ యోగంతో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. స్థానికంగా గుర్తింపు లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో మీన రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+