కృష్ణుడి కటాక్షంతో వీరింట కనకవర్షం.. మీ రాశి ఉందా?
ద్వాదశ రాశుల వారిలో ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కో గ్రహం కొన్ని రాశులను పాలిస్తుంది. అంతేకాదు ఒక్కొక్క రాశి వారికి ఒక్కో భగవంతుడు అండగా నిలుస్తాడు. శివుడికి కొన్ని రాశులు, హనుమంతుడికి కొన్ని రాశులు, లక్ష్మీదేవికి కొన్ని రాశులు ఇష్టమైనట్టే కృష్ణుడికి కూడా ఇష్టమైన కొన్ని రాశులు ఉన్నాయి. ఆ రాశుల వారు కృష్ణుని కటాక్షంతో ఎప్పుడూ సంతోషంగా జీవిస్తారు. శ్రీకృష్ణుడి కటాక్షంతో సంతోషంగా జీవించే ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి శ్రీకృష్ణుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వృషభ రాశి జాతకులు కృష్ణుడి ప్రత్యేక ఆశీస్సులను పొందుతారు. వీరి ఆర్థిక పరిస్థితి కృష్ణుడి దయవల్ల బాగుంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కృష్ణుడు వీరిని ఆదుకుంటాడు. ప్రతికూలతల నుండి కృష్ణుడు వీరిని సానుకూలత వైపు నడిపిస్తాడు. ముఖ్యంగా వీరి కెరీర్ కృష్ణుడి దయవల్ల చాలా బాగుంటుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శ్రీకృష్ణుడు సానుకూల ఫలితాలను ఇస్తాడు. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. కృష్ణుడి అనుగ్రహంతో వీరి జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితంలో ఏ లోటు లేకుండా హాయిగా ఉంటారు. కష్టాలను సులువుగా దాటేస్తారు.
సింహరాశి
సింహ రాశి వారికి శ్రీకృష్ణుడి వల్ల మంచి జరుగుతుంది. కృష్ణుడి అనుగ్రహం సింహ రాశి వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. వీరికి ఎటువంటి కష్టాలు వచ్చినా కృష్ణుడు దయ వల్ల త్వరగా తొలగిపోతాయి సింహరాశి జాతకులు త్వరగా సక్సెస్ ను అందుకుంటారు. పనిలో ఏవైనా ఆటంకాలు ఎదురైతే అవి సునాయాసంగానే తొలగిపోతాయి. సింహ రాశి వారు చాలా ధైర్యంగా ముందుకు సాగుతారు.
తులారాశి
తులా రాశి వారికి శ్రీకృష్ణుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. తులారాశి జాతకులు కృష్ణుడి అనుగ్రహంతో కష్టాల నుంచి బయటపడతారు కృష్ణుడు ఈ రాశి వారిని చాలా ప్రేమగా చూస్తాడు. ఏ పని మొదలుపెట్టిన అది కచ్చితంగా పూర్తయ్యేలా కృష్ణుడు అనుగ్రహిస్తాడు. తులారాశి జాతకులు కృష్ణుడి కటాక్షంతో సమస్యల నుంచి బయటపడతారు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications