కుబేరుడు జీవితకాలం సంపదల ఖజానా రాసిచ్చిన రాశులివే!
హిందూమతంలో ప్రతి ఒక్క దేవుడికి తమదైన ప్రాధాన్యత ఉంటుంది. విష్ణువు, శివుడు, లక్ష్మీదేవి, పార్వతి దేవి ఇలా ప్రతి ఒక్కరికి ఒక విశిష్టత ఉంటుంది. ఇక ఇదే సమయంలో కుబేరుడికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని రాష్ట్రాలలో కుబేరుడిని ప్రధాన దేవుడిగా పూజిస్తారు కూడా. కుబేరుడు సంపదలకు అధిప.తి కుబేరుడిని పూజించడం కారణంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
కుబేరుడు కరుణిస్తే కాసుల పంట
ఎవరైతే ప్రతి శుక్రవారం కుబేరుడిని పూజిస్తారో వారికి సంపన్న యోగం కలుగుతుందని చెబుతారు. కుబేరుడి ఆశీర్వాదం ఉంటే కచ్చితంగా వారి ఇంట కాసుల పంట పండుతుందని చెబుతారు. ప్రతి శుక్రవారం మరో లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని కూడా పూజించటం వల్ల జీవితంలో సంతోషంతో పాటు శ్రేయస్సు కూడా లభిస్తుంది. మనకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం అవుతాయి.

కుబేరుడికి ఇష్టమైన రాశులు
అంత ప్రాధాన్యత ఉన్న కుబేరుడుకి ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయి. ఆ రాశుల వారికి కుబేరుడు ఎప్పుడు సంపదల వర్షం కురిపిస్తాడు. ఎప్పుడూ రిచ్ గా ఉండేలా, లగ్జరీలతో జీవించేలా ఆశీర్వదిస్తాడు. మరి కుబేరుడు కి ఇష్టమైన అదృష్ట రాశులలో మీరు ఉన్నారా ఒక్కసారి తెలుసుకోండి.
వృషభ రాశి
కుబేరుడి ఆశీస్సులు వృషభరాశి జాతకులపై మెండుగా ఉంటాయి. వృషభరాశికి శుక్రుడు అధిపతి కాగా, సంపదకు శుక్రుడిని ప్రతీకగా భావిస్తారు. అటువంటి వృషభరాశి కుబేరుడికి ఇష్టమైన రాశి. కుబేరుడి ఆశీస్సులతో మీరు ఏ పని చేపట్టినా కచ్చితంగా పూర్తవుతుంది. కుటుంబంతో సుఖసంతోషాలతో గడిపే రోజులు వస్తాయి. కుబేరుడి అనుగ్రహంతో వీరు కోటీశ్వరులుగా జీవిస్తారు..
కర్కాటక రాశి
కర్కాటకరాశి జాతకులపై కుబేరుడి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. కర్కాటక రాశి కూడా కుబేరుడికి ఇష్టమైన రాశి . ఇక కర్కాటక రాశి జాతకులపై కుబేరుడి దయవల్ల వారి జీవితంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. కుబేరుడు వీరికి సంపదల ప్రకాశం ఇస్తాడు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులపై కుబేరుడి కరుణ పుష్కలంగా ఉంటుంది. ధనస్సు రాశి జాతకులు ఆధ్యాత్మికతలో ఎక్కువగా ఉండడం వల్ల వీరికి కుబేరుడి ఆశీస్సులు ఉంటాయి. వీరు ఎప్పుడు అదృష్టవంతులుగా ఉంటారు. సంపదలతో తులతూగుతారు. వీరింట కుబేరుడు కనకవర్షం కురిపిస్తాడు. ఏ పని చేసినా విజయం వరిస్తుంది.
తులారాశి
కుబేరుడి కటాక్షం తులా రాశి జాతకుల పైన కూడా ఉంటుంది. కుబేరుడి ప్రభావంతో తులా రాశి జాతకులు ఐశ్వర్యవంతులుగా ఉంటారు. కుబేరుడి అనుగ్రహంతో వీరికి డబ్బు సంబంధించిన సమస్యలు ఉండవు. వీరు దానధర్మాలు చేస్తారు. వీరు కష్టపడి పని చేయడం ద్వారా ఫలితాలను సాధిస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి జాతకుల జీవితం కుబేరుడి ప్రత్యేక అనుగ్రహం వల్ల బాగుంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా విజయం సాధించేవరకు విపరీతంగా శ్రమిస్తారు. వీరిపైన కూడా కుబేరుడి దయ ఉండటంవల్ల వీరికి కూడా డబ్బు సమస్యలు ఉండవు. వీరు జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవడానికి కష్టపడతారు. అందుకే కుబేరుడు వీరింట నివసిస్తాడు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications