తిరోగమనంలో వీరికి తిరుగులేని సంపదలను ఇవ్వనున్న శనిదేవుడు .. మీరున్నారా !
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం ద్వాదశ రాశుల వారి జీవితాలను నిర్దేశిస్తాయి. గ్రహాలలో ముఖ్య గ్రహంగా చెప్పుకునే శని గ్రహం ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అటువంటి శని గ్రహం మీనరాశిలో కొద్ది రోజుల్లో తిరోగమన సంచారం చేయనున్నాడు. క్రమశిక్షణకు మారుపేరైన శని జులై 13వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తిరోగమన సంచారాన్ని ప్రారంభిస్తాడు.
శని తిరోగమన సంచారం
మీన రాశిలో శని తిరోగమన సంచారాన్ని ప్రారంభించిన తర్వాత మళ్లీ నాలుగు నెలల తర్వాత ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభిస్తాడు. అంటే మళ్ళీ నవంబర్ 28వ తేదీన శని మళ్లీ ప్రత్యక్ష సంచారంలోకి వస్తాడు. అప్పటివరకు శని తిరోగమన సంచారమే చేస్తాడు. ఇక తిరోగమన సంచారం చేసే శని కొన్ని రాశుల వారిని కటాక్షించనున్నాడు. ఇక మీనరాశిలో శని తిరోగమన సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కన్యారాశి
కన్యారాశి జాతకులు మీనరాశిలో శని తిరోగమన సంచారం కారణంగా శుభఫలితాలను పొందుతారు. ఈ సమయంలో కన్యారాశి జాతకులకు ఏ పని చేసిన ఫలితం అనుకూలంగా ఉంటుంది. కన్యారాశిలో ఏడవ ఇంట్లో శని తిరోగమనం జరుగుతుంది. దీంతో ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కన్యారాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది .వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వీరి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది.
మీనరాశి
శని తిరోగమన సంచారం మీనరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. కాస్త ఓర్పు, నేర్పుతో చేసే పనులు మంచి ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగాలు చేసే వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. విదేశాలలో ఉద్యోగాలు చేసేవారు ప్రయోజనాలు పొందుతారు. మీనరాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాల కారణంగా సంతోషంగా ఉంటారు.
మకర రాశి
శని తిరోగమన సంచారం మకర రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. మకర రాశి వారు ఈ సమయంలో అన్ని విధాల లబ్ధిని పొందుతారు. కష్టపడి పనిచేసిన వారికి శని సానుకూల ప్రయోజనాలను ఇస్తాడు. మకర రాశిలో మూడవ ఇంట్లో శని తిరోగమనంలో ఉండడం వల్ల మేలు జరుగుతుంది. ఉద్యోగాలు లేనివారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. తోబుట్టువుల నుంచి మంచి సహాయం అందుతుంది. మకర రాశి వారికి ఈ సమయంలో కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications