శివుడికి ఇష్టమైన, ఎల్లపుడూ కాపాడే రాశులవారు వీళ్ళే.. మీరున్నారా!!
సనాతన ధర్మంలో శివుడిని మహాదేవుడిగాను, దేవదేవుడు గాను పిలుస్తారు. శివుడు తన భక్తులను ఎప్పుడూ విపత్తుల నుండి కాపాడతాడు. శివుడు భక్తవ శంకరుడు, భోళా శంకరుడు. దేవుళ్ళందరిలోనూ శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం అని చెబుతారు. శివుని కటాక్షం ఉంటే అంతా శుభమే జరుగుతుందని భక్తుల విశ్వాసం.
శివుడి కటాక్షం ఉండే రాశులు
ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేకుంటే చీమ కూడా కుట్టదంటారు. అందుకే లయకారుడైన శివుడని భక్తులు విశేషంగా పూజిస్తారు. ఇక శ్రావణమాసం శివుడికి ఇష్టమైన మాసం. శివుని ఆశీస్సులు పొందడానికి కోరుకున్న వరాలను సాధించడానికి శ్రావణమాసమే ఉత్తమ సమయం. అయితే శివుడి కటాక్షం ఎప్పుడూ ఉండే కొన్ని రాశుల వారు ఉన్నారు. వారికి శివుడు ఎప్పుడూ రక్షా కవచంగా నిలిచి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారిపై శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కర్కాటక రాశికి అధిపతి శివుని నుదుటిపై ఉన్న చంద్రుడు కావడం వల్ల కర్కాటక రాశి వారిని ఎల్లప్పుడూ శివుడు వివిధ సంక్షోభాల నుంచి, సమస్యల నుంచి కాపాడుతూ ఉంటాడు. కర్కాటక రాశి వారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా బాధపెడితే వారు మరిచిపోలేరు. ఇక ఈ సున్నిత మనస్కులను శివుడు రక్షా కవచంగా నిలిచి కాపాడుతూ ఉంటాడు.
తులారాశి
తులారాశి వారి పైన శివుని కటాక్షం ఎప్పటికీ ఉంటుంది. శుక్రుడు తులా రాశికి అధిపతి .తులారాశి జాతకులు గొప్ప ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉంటారు. వీరిని శివుడు కాపాడుతూ ఉంటాడు. తులా రాశి జాతకులు మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు అభిరుచుల కోసం డబ్బు ఖర్చు చేయడానికి వెనకాడరు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. వీరికి ఎప్పుడూ రక్షా కవచంగా శివుడు నిలిచి కాపాడుతూ ఉంటాడు.
మకర రాశి
మకరరాశి వారిని శివుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. మకరరాశి పాలకగ్రహం శనిదేవుడు. శనిదేవుడు శివుడి యొక్క గొప్ప భక్తుడు. శివుడిని శనిదేవుడు గురువుగా భావిస్తాడు. శనిదేవుడు శివుడి ఆశీస్సులతోనే దండాధికారి పదవిని పొందాడు. అందువలన శివుడు మకరరాశి జాతకులపైన ప్రత్యేక ఆశీర్వాదాలు కలిగి ఉంటాడు మకరరాశి వారు కష్టపడి పని చేస్తారు. వారు తమ తమ రంగాలలో విజయం సాధిస్తారు. వారికి శివుడు ఎప్పుడు అండగా ఉంటాడు.
కుంభరాశి
శనిదేవుడు కుంభరాశిని పాలిస్తాడు. శివుడు ఎప్పుడు శనిదేవుని ఆదరంగా చూస్తాడు. కాబట్టి శనిదేవుని రాశైన కుంభరాశిపై కూడా తన కటాక్షాన్ని చూపిస్తూ ఉంటాడు. కుంభ రాశి శని దేవునికి చాలా ప్రియమైన రాశి. ఈ రాశి వారినీ అకాల మరణం నుండి శివుడు కాపాడుతాడు. వీరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. వీరు కష్టపడి పని చేసేవారు మరియు శ్రద్ధ కలిగిన వారు. వారు తమ జీవితంలో పెద్ద సవాళ్లను కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. అటువంటి శక్తిని శివుడు వారికి ఇస్తాడు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications