ఈ రాశులపై ఎల్లప్పుడూ శివయ్య కటాక్షం.. వీరికి కుబేర యోగం!
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అటువంటి పరమశివుడు భక్తవ శంకరుడు, భోళాశంకరుడు. ఏ కోరిక కోరిన త్వరగా వరాలిచ్చే శివయ్యను చాలామంది భక్తులు పూజిస్తూ ఉంటారు. సోమవారం నాడు శివునికి అభిషేకాలు, అర్చనలు చేసి తమ భక్తిని చాటుకుని వరాలు ఇవ్వమని కోరుతూ ఉంటారు. అలా శివయ్యను కోరితే కష్టాలన్నింటినీ తొలగించి సంతోషాన్ని ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
శివుడికి ఇష్టమైన రాశులు
అటువంటి పరమశివునికి ఇష్టమైన కొన్ని రాశులు ఉన్నాయి. వీరు పుట్టుకతోనే అదృష్టవంతులు. ఈ రాశుల వారు పరమశివుని కటాక్షంతో కష్టాల నుండి గట్టెక్కి సంతోషంగా జీవిస్తారు . మరి ఆ రాశులు ఏమిటి? వారి పైన శివయ్య కటాక్షం ఎలా ఉంటుంది? తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశి జాతకుల పైన పరమశివుని కటాక్షం ఉంటుంది .మేష రాశి వారు శివుని అనుగ్రహంతో విశేషమైన ప్రయోజనాలను పొందుతారు. మీరు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బోలెడు లాభాలను పొందుతారు. మేష రాశి వారికి ఎటువంటి సమస్యలు వచ్చిన శివయ్య అనుగ్రహంతో పరిష్కారం అవుతాయి. వీరి జీవితం శివుని కటాక్షంతో సంతోష దాయకంగా ఉంటుంది.
కుంభరాశి
కుంభ రాశి జాతకులకు శివయ్య అనుగ్రహంతో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కుంభ రాశిలో జన్మించిన వారికి శని అధిపతిగా వ్యవహరిస్తాడు కాబట్టి ఈ రాశుల వారి పైన ఎప్పటికీ శివయ్య అనుగ్రహం ఉంటుంది. మీరు ప్రతిరోజు శివుడిని పూజించడం వల్ల జీవితంలో సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలను శివయ్య ఎప్పటికప్పుడు పరిష్కరించి మంచి జీవితాన్ని ఇస్తాడు. కుంభ రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కచ్చితంగా ఉంటుంది.
వృశ్చికరాశి
వృశ్చిక రాశి జాతకులకు పరమేశ్వర కటాక్షం సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వారు శివయ్య ఆశీస్సులతో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఏ పనులు చేసిన ధన లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వీరికి ఎటువంటి సమస్యలు రాకుండా శివయ్య వీరిని కాపు కాస్తాడు.
మకరరాశి
మకర రాశి జాతకులకు పరమశివుడి కటాక్షం శుభ ఫలితాలను ఇస్తుంది. శివయ్య ఆశీస్సులతో అద్భుతమైన లాభాలను పొందుతారు. వీరికి కష్టాల నుంచి శివయ్య సులభంగా గట్టెక్కించి మంచిగా జీవించే మార్గం చూపిస్తాడు. ఎలాంటి ప్రయత్నాలు చేసిన మకర రాశి జాతకులు ఈ సమయంలో విజయాలను సాధిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications