120 రోజుల తర్వాత యోగనిద్ర నుండి లేస్తూనే వీరిపై కనకవర్షం కురిపిస్తానన్న విష్ణువు!
హిందూమతంలో ప్రతి ఏకాదశి తిథికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. కార్తీకమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని దేవుత్తని ఏకాదశిగా, ప్రబోధిని ఏకాదశిగా చెబుతారు. నవంబర్ 12వ తేదీన ఈ సంవత్సరం ప్రబోధిని ఏకాదశి వస్తుంది. అయితే ఈ ఏకాదశి తిధి నవంబర్ 11 సాయంత్రం 6.46 నిమిషాలకు ప్రారంభమై నవంబర్ 12 సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాలకు ముగుస్తుంది.
ప్రబోధిని ఏకాదశి నాడు విశేష యోగాలు
ఉదయం వచ్చే తేదీనే ప్రమాణికంగా తీసుకుంటాం కాబట్టి ఈ ప్రబోధిని ఏకాదశి నవంబర్ 12 మంగళవారం రోజునే ఆచరిస్తాం.ఇక ఈరోజుతో చాతుర్మాసం ముగుస్తుంది. 120 రోజుల తర్వాత యోగ నిద్ర నుండి విష్ణువు బయటకు వస్తాడు. ఈ రోజున హర్షణ యోగం, సర్వార్ధ సిద్ధియోగం ఏర్పడుతున్నాయి. ఇక దేవుత్తని ఏకాదశి రోజు గ్రహ సంచారం కారణంగా జరిగే శుభ యాదృచ్ఛికాలు నాలుగు రాశుల వారి జీవితంలో సకల శుభాలను తీసుకురాబోతున్నాయి.

మేషరాశి
ప్రబోధిని ఏకాదశి నాడు మేషరాశి జాతకులకు ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశం ఉంది . త్వరలో మేషరాశి జాతకులు శుభవార్తలను వినే అవకాశం కూడా ఉంది. మేషరాశి జాతకులు ప్రబోధిని ఏకాదశి నుండి తల్లిదండ్రుల నుంచి విశేషమైన మద్దతును పొంది జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.
కర్కాటక రాశి
ప్రబోధిని ఏకాదశి రోజు కర్కాటక రాశి జాతకులు వృత్తి వ్యాపారాలలో విశేషమైన ప్రయోజనాలను పొందుతారు . ఇక ప్రబోధిని ఏకాదశి నాటి నుంచి వీరు ఏవైనా కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు. ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కర్కాటక రాశి జాతకులకు ఉంది.
తులారాశి
ప్రబోధిని ఏకాదశి నుండి తులా రాశి జాతకులకు కలిసొస్తుంది. ఉద్యోగ వ్యాపారాలకు ఇది మంచి సమయం. ఉద్యోగం చేసే చోట ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశం కలుగుతుంది. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
వృశ్చిక రాశి
ప్రబోధిని ఏకాదశి నుండి వృశ్చిక రాశి జాతకులు అన్ని రంగాలలో విజయాలను సాధిస్తారు. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీరి వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారి ఆరోగ్యం కూడా ఈ సమయంలో బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications