జులై 8నుండి 251 రోజులపాటు వీరికి ధనలక్ష్మీ కటాక్షం
వేద జ్యోతిష్య శాస్త్రంలో నీడ గ్రహంగా చెప్పబడే రాహువు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న విషయం తెలిసిందే. రాహువు 2025 సంవత్సరం వరకు మీనరాశిలోనే కొనసాగుతాడు. 2025 లో మళ్ళీ రాహువు తన రాశిని మార్చుకుంటాడు. అయితే త్వరలో రాహువు నక్షత్రాన్ని మార్చుకుంటున్నాడు.ప్రస్తుతం రేవతి నక్షత్రంలో ఉన్న రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రవాణా అవుతాడు.
ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాహువు
జులై 8వ తేదీన రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి వెళతాడు. మార్చి 16 2025వరకు రాహువు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. ఆపై రాహువు పూర్వాభాద్ర నక్షత్రంలోకి వెళ్తాడు. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రానికి శనీశ్వరుడు అధిపతి కావడంతో శనికి రాహువుకు మధ్య మంచి సఖ్యత ఉన్న కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. వారు 251రోజులు శుభ ఫలితాలను పొందుతారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
రాహువు నక్షత్ర మార్పు కారణంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా లాభదాయకంగాను, సంతోషదాయకంగానూ ఉంటుంది. వృషభ రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆర్థికంగా బలోపేతం కావడం వల్ల ఖర్చులు పెరిగినప్పటికీ వృషభ రాశి వారు వాటిని హాండిల్ చేయగలుగుతారు. ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు నూతన పనులను ప్రారంభిస్తే మంచిదని చెప్పబడింది. వృషభ రాశి జాతకుల కుటుంబ జీవితం సంతోషకరంగా సాగుతుంది.
తులారాశి
తులా రాశి వారికి ఉత్తరాభాద్ర నక్షత్రం లోకి రాహువు మార్పు చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. రాహువు నక్షత్ర మార్పు వీరికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో వీరి దాంపత్య జీవితం కూడా సుఖంగా సాగుతుంది. ఆర్థిక విషయాలలో వీరికి ఊహించని సానుకూల ఫలితాలు వస్తాయి.
వృశ్చిక రాశి
ఉత్తరాభాద్ర నక్షత్రం లోకి రాహువు ప్రవేశించడం వృశ్చిక రాశి జాతకుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో వీరికి గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. ఈ సమయంలో శుభవార్తలను వింటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications