Lucky colors for zodiac signs: తులారాశి నుండి మీన రాశి వరకు.. అదృష్ట రంగులివే!!
జ్యోతిష్య శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో రంగులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశి చక్రాలు ఉన్నాయి. ప్రతి రాశి చక్రానికి సంబంధించి ఒక్కొక్క అదృష్ట రంగు ఉంటుంది. అదృష్ట రంగును ఆ రాశి జాతకులు ధరించినప్పుడు అది వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. వారికి అన్ని విధాలా కలిసి వచ్చేలా చేస్తుంది.
తులారాశి నుండి మీన రాశి వరకు ఉన్న రాశి చక్ర జాతకులకు కలిసి వచ్చే అదృష్ట రంగులు ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. తులా రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట రంగులు తెలుపు మరియు లేత పసుపు రంగులు. ఈ రంగులు తులా రాశి వారి జీవితంలో శాంతిని, సమతుల్యతను, సంతృప్తిని ఇస్తాయి.

వృశ్చిక రాశి వారి జీవితంలో కలిసొచ్చే అదృష్ట రంగు ఎరుపు మరియు మెరూన్ రంగులు. ఈ రంగులు వృశ్చిక రాశి వారికి సవాళ్లను అధిగమించే శక్తిని ఇస్తాయి. ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే అదృష్ట రంగు పసుపు. పసుపు రంగు ధనుస్సు రాశి వారికి శాంతిని, సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది. ఇది వారి జీవితాలలో ఆశావహ దృక్పథాన్ని, సానుకూలతను తీసుకువస్తుంది.
మకర రాశి వారికి కలిసొచ్చే అదృష్ట రంగులు నలుపు మరియు ముదురు నీలం. ఈ రంగులు క్రమశిక్షణ, బాధ్యత మరియు పట్టుదలను ప్రోత్సహిస్తాయి. మకరరాశి వారి జీవితంలో సానుకూలత తెస్తాయి. నలుపు మరియు ముదురు నీలం రంగులు మకరరాశి వ్యక్తులు తమ లక్ష్యాలను సాధించటంలో సహాయపడతాయి.
కుంభ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట రంగులు నలుపు మరియు ముదురు నీలం రంగులు. ఈ రంగులు జీవితంలోని సవాళ్ళను పరిష్కరించటానికి,అవసరమైన స్థిరత్వాన్నిఇచ్చి కుంభ రాశి వారిని ముందుకు నడిపిస్తాయి. మీనరాశి వారికి కలిసి వచ్చే అదృష్ట రంగు పసుపు. పసుపు మీనరాశి వ్యక్తులకు జీవితంలో ఆనందం, సానుకూలతను, ఆశావాదాన్ని పెంచుతుంది. అందుకే రంగులకు ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని రాశుల వారు వారికి అదృష్టాన్ని ఇచ్చే రంగులను ఎక్కువ ధరిస్తే మంచిది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications