Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాహు గ్రస్త చంద్ర గ్రహణం - పరిహారాలు, ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు

డా.ఎం .ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.

Lunar Eclipse 2023: All You Need To Know About Chandra Grahan

స్వస్తి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధ పూర్ణిమ, శనివారము తేది 28-10-2023 రోజున అర్ధరాత్రి సమయంలో అశ్వని నక్షత్రం మేషరాశిలో రాత్రి గం. 01:05 నిమిషాల నుండి గం. 02 : 24 నిమిషాల వరకు రాహుగ్రస్త చంద్ర గ్రహణం సంభవిస్తున్నది. ఈ గ్రహణం కొన్ని రాశుల వారికి అనుకూలముగానూ, మరికొన్ని రాశుల వారికి వ్యతిరేకంగానూ, ఇంకొన్ని రాశుల వారికి సామాన్యం గానూ ఉంటుంది. జ్యోతిషశాస్త్ర సూత్రాల ప్రకారం జన్మ రాశిరిత్యా అనుకూలంగా వున్నా కొన్ని నక్షత్రాల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. 'ముహూర్త చింతామణి' అనే గ్రంథం ప్రకారం కొన్ని సూత్రాలు, ఫలితాలు చెప్ప్పబడింది.

* జన్మ నక్షత్రంలో గ్రహణం ఏర్పడితే కీడు.

* జన్మరాశిలో ఏర్పడితే హాని.

* ఈ ఫలితాలు రాశులు, లగ్నాలకు కూడా వర్తిస్తాయి.

* ఈ గ్రహణ ప్రభావ ఫలితాలు 6 నెలల వరకు చూపుతాయి.

1. శుభ ఫలితాలు పొందే రాశులు :- మిథున, కర్కాటక, వృశ్చిక, కుంభరాశులు.

2. మధ్యమ ఫలితాలు పొందే రాశులు :- సింహ, తుల, ధనుస్సు, మీనరాశులు.

3. అధమ ఫలితాలు పొందే రాశులు :- మేష, వృషభ, కన్య, మకరరాశులు.

* ఈ అధమ ఫలితాలు వచ్చే రాశులలో, నక్షత్రాలతో పాటుగా ఈ క్రింది నక్షత్రాల వారికి కూడా గ్రహణ శాంతి అవసరం.

అశ్వని, రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఖ, హస్త, స్వాతి, అనూరాధ, మూల, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర.

* కర్కాటకరాశికి శుభ ఫలితాలు వున్నా పుష్యమి వారికి ఇబ్బంది.

* వృశ్చికరాశికి శుభ ఫలితాలు వున్నా అనూరాధ వారికి ఇబ్బంది.

* మీన రాశి వారికి శుభ ఫలితాలు వున్నా ఉత్తరాభాద్ర వారికి ఇబ్బంది.

* గ్రహణ శాంతి అవసరం అయిన నక్షత్రాలు:- అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, మూల, పుష్యమి, మఖ, హస్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర.

** గ్రహణ ప్రభావంతో ఫలితాలు ఎవరిపై, ఏ రంగం వారికి ఏలాంటి ఫలితాలుచూపుతాయి అనే విషయంగా గమనిస్తే రాజులకు, పాలకులకు, బ్రాహ్మణులకు, ప్రముఖ మంత్రులకు, సినీ నటులకు, నాట్య శాస్త్రీయ పండితులకు, క్రీడాకారులకు, నదీ తీరవాసులకు మారక భయములు, ప్రమాదాలు గోచరిస్తున్నాయి. ప్రముఖ స్త్రీలకు, ఉత్తరాది వాసులకు నష్టం వాటిల్లుట. ధరలలో మార్పు వచ్చుట. మతవాదములు, వర్గపోరులు పెరుగుట. అగ్ని సంబంధిత ప్రమాదాలు, భయములు కలుగుట, దొంగతనాలుపెరుగుతాయి. రస ధాతువులు, భోజన పదార్ధాలు, వస్త్రాల ధరలు అధికం అవుతాయి. సాహిత్య రంగమునకు, కళలకు మంచి గుర్తింపు వస్తుంది.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఘాతం అనగా ఊహించి చిక్కులు. మానసిక సమస్యలు, తలకు సంబంధించిన గాయాలు అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. మీ జాతకంలో ఉన్న గ్రహ స్థితి, గోచార గ్రహస్థితి, దశ అంతర్దశలను ఒక సారి పరిశీలింపజేసుకుని పరిహారాలు పాటించండి మేలు జరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల గోమాతకు కిలోపావు బియ్యం, గుమ్మడికాయ, తోటకూర, అరటిపండ్లు, బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- 'అపాయం' కుటుంబంలో ఆందోళనలు, ధన నష్టం. మీ జాతకంలో ఉన్న గ్రహ స్థితి, గోచార గ్రహస్థితి, దశ అంతర్దశలను ఒక సారి పరిశీలింపజేసుకుని పరిహారాలు పాటించండి మేలు జరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతకు కిలోపావు బియ్యం, గుమ్మడికాయ, తోటకూర, అరటిపండ్లు, బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- 'లాభం' సంపద పెరుగుతుంది, విశేషమైన అవకాశాలు అంది వస్తాయి. గోమాతకు కిలోపావు బియ్యం, గుమ్మడికాయ, తోటకూర, అరటిపండ్లు, బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 'సుఖం' వాదోపవాదాలు పెరుగుతాయి, కోపం అదుపులో పెట్టుకోవాలి. మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారన్న విషయం మరచిపోవద్దు. మీ జాతకంలో ఉన్న గ్రహ స్థితి, గోచార గ్రహస్థితి, దశ అంతర్దశలను ఒక సారి పరిశీలింపజేసుకుని పరిహారాలు పాటించండి మేలు జరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతకు కిలోపావు బియ్యం, గుమ్మడికాయ, తోటకూర, అరటిపండ్లు, బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- 'గౌరవ భంగం' ముఖ్యమైన పనులు ఆగిపోవుట, పిల్లల నుండి సమస్యలు. మీరు శని భగవానుని సప్తమ వీక్షణంలో ఉన్నారన్న విషయం మరచిపోవద్దు. మీ జాతకంలో ఉన్న గ్రహ స్థితి, గోచార గ్రహస్థితి, దశ అంతర్దశలను ఒక సారి పరిశీలింపజేసుకుని పరిహారాలు పాటించండి మేలు జరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతకు కిలోపావు బియ్యం, గుమ్మడికాయ, తోటకూర, అరటిపండ్లు, బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 'మరణ సమానమైన పరిస్థితులు' కొంత మేలుకూడ గోచరిస్తున్నది వాహన లాభం, ఆస్తులు, సౌఖ్యం పొందుతారు. మీ జాతకంలో ఉన్న గ్రహ స్థితి, గోచార గ్రహస్థితి, దశ అంతర్దశలను ఒక సారి పరిశీలింపజేసుకుని పరిహారాలు పాటించండి మేలు జరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతకు కిలోపావు బియ్యం, గుమ్మడికాయ, తోటకూర, అరటిపండ్లు, బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- వైవాహిక జీవితంలో లేదా 'జీవిత భాగస్వామికి పీడ' జీవిత భాగస్వామితో విభేదాలు, ఒత్తిడి పెరుగుతుంది. మీ జాతకంలో ఉన్న గ్రహ స్థితి, గోచార గ్రహస్థితి, దశ అంతర్దశలను ఒక సారి పరిశీలింపజేసుకుని పరిహారాలు పాటించండి మేలు జరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతకు కిలోపావు బియ్యం, గుమ్మడికాయ, తోటకూర, అరటిపండ్లు, బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 'సౌఖ్యం' వ్యాధులు, అధిక ఖర్చులు. మీరు అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారన్న విషయం మరచిపోవద్దు. మీ జాతకంలో ఉన్న గ్రహ స్థితి, గోచార గ్రహస్థితి, దశ అంతర్దశలను ఒక సారి పరిశీలింపజేసుకుని పరిహారాలు పాటించండి మేలు జరుగుతుంది. గోమాతకు కిలోపావు బియ్యం, గుమ్మడికాయ, తోటకూర, అరటిపండ్లు, బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- 'చింత' అవమానాలు, వాగ్వివాదం. మీ జాతకంలో ఉన్న గ్రహ స్థితి, గోచార గ్రహస్థితి, దశ అంతర్దశలను ఒక సారి పరిశీలింపజేసుకుని పరిహారాలు పాటించండి మేలు జరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతకు కిలోపావు బియ్యం, గుమ్మడికాయ, తోటకూర, అరటిపండ్లు, బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 'వ్యధ' వాహన లాభం, ఆస్తులు, భౌతిక సుఖం ఉన్నప్పటికిని మీరు గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారన్న విషయం మరచిపోవద్దు. మీ జాతకంలో ఉన్న గ్రహ స్థితి, గోచార గ్రహస్థితి, దశ అంతర్దశలను ఒక సారి పరిశీలింపజేసుకుని పరిహారాలు పాటించండి మేలు జరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతకు కిలోపావు బియ్యం, గుమ్మడికాయ, తోటకూర, అరటిపండ్లు, బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- 'సంపద' వ్యాపార లాభాలు, పాత బాకీలు వసూల్ అవుతాయి. మీ జాతకంలో ఉన్న గ్రహ స్థితి, గోచార గ్రహస్థితి, దశ అంతర్దశలను ఒక సారి పరిశీలింపజేసుకుని పరిహారాలు పాటించండి మేలు జరుగుతుంది. మీరు గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారన్న విషయం మరచిపోవద్దుఅనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతకు కిలోపావు బియ్యం, గుమ్మడికాయ, తోటకూర, అరటిపండ్లు, బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- 'క్షతి' వ్యాపారం, వ్యవహారం మందగిస్తుంది, ధన నష్టాలు గోచరిస్తున్నాయి. మీరు గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారన్న విషయం మరచిపోవద్దు. మీ జాతకంలో ఉన్న గ్రహ స్థితి, గోచార గ్రహస్థితి, దశ అంతర్దశలను ఒక సారి పరిశీలింపజేసుకుని పరిహారాలు పాటించండి మేలు జరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాతకు కిలోపావు బియ్యం, గుమ్మడికాయ, తోటకూర, అరటిపండ్లు, బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

***
గ్రహణ శాంతి ఎలా చేసుకోవాలి?

1. శాస్త్ర విధానంలో అయితే వెండి చంద్ర బింబం, బంగారు సర్పం, కంచు పాత్రలో నెయ్యి, బియ్యం, మినుములు దక్షిణతో దానం చేయాలి.

2. సాధ్యం కాకపోతే ఇంటిలో చంద్ర, రాహు జపాలు, ఆ మంత్ర సంపుటితో పాశుపత విధానంలో రుద్రాభిషేకం, హోమం.

* గ్రహములు అన్ని రాహు కేతువుల మధ్యలో స్థితి.

* ఇంద్రియముల అధిపతి ఇంద్రుడు.

* జీవ కారకుడు, ధన కారకుడు వక్రీ బృహస్పతి.

* మనసు కారకుడు చంద్రుడితో కూడిన గ్రహణం

సూచన:- నిర్లక్ష్యం చేయకుండా అవకాశం ఉన్నవారు పైన చెప్పిన పరిహారాలు మీ సమీప సద్గురువులతో, పండితులతో చేయించుకోగలరు.

అవకాశం లేని పై నక్షత్రాలు, రాశి, లగ్నాల వారు జ్యోతిషశాస్త్రంపై నమ్మకం ఉన్నవారు గ్రహణ విడుపు స్నానాదులు అయ్యాక ఇంట్లో ఉన్న పూజ మందిరంలో ప్రోక్షణ, పూజాలు ముగించుకుని, జంధ్యం మార్చుకుని, ఇంటికి రక్షణగా కట్టుకున్న గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ, పట్టిక మొదలగునవి తొలగించి కొత్తవి పూజ జరిపించుకుని కట్టుకోవాలి. రావి చెట్టుకి పూజ చేసి 11 ప్రదక్షిణలు చేయండి. సమీప శివాలయానికి వెళ్లి అభిషేక ఆరాధనలు చేసి గోమాతకు కిలోపావు బియ్యం, గుమ్మడికాయ, తోటకూర, అరటిపండ్లు, బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. తల్లిదండ్రులకు పాద నమస్కారం చేయండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+