వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Lunar eclipse 2023: నేడే చంద్రగ్రహణం.. గ్రహణ సమయంలో గర్భిణీలు ఏం చెయ్యాలి!!

|
Google Oneindia TeluguNews

నేడు చంద్రగ్రహణం. 2023 వ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం ఈరోజు రాత్రి 08:44 నిమిషాల సమయంలో ప్రారంభమవుతుంది. ఈసారి అరుదైన పెనుంబ్రల్ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సూర్యుడు, చంద్రుని మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్ర గ్రహణాన్ని ఎవరైనా నేరుగా చూడొచ్చు. చంద్రగ్రహణాన్ని నేరుగా చూడటం వల్ల ఎలాంటి హానీ కలగదు.

ఏదైనా గ్రహణాలు ఏర్పడినప్పుడు గ్రహణానికి ముందు ఉండే కాలాన్ని సూతక కాలం అంటారు. సహజంగా సూతక కాలాన్ని అశుభ కాలంగా పరిగణిస్తారు. సూతక కాలంలో కూడా కొన్ని పాటించాల్సిన నియమాలు ఉన్నాయి అని పెద్దలు చెబుతారు. ఇదిలా ఉంటే గ్రహాల కదలికలు, ఖగోళంలో సంభవించే మార్పులు, గ్రహణాలు మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.

Lunar eclipse 2023 today.. What should pregnant women do during eclipse!!

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై గ్రహణాలు చాలా దుష్ప్రభావాలను చూపించే అవకాశం ఉంటుందని పెద్దలు చెబుతారు. అందుకే గర్భిణీ మహిళలు గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు 08:44 నుండి గర్భిణీ స్త్రీలు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఒకవేళ బాగా ఆకలి అనిపిస్తే పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. చంద్ర గ్రహణ సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు. పదునైన వస్తువులను ముట్టుకోకూడదు.

గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలి. గ్రహణం పట్టిన సమయంలో మెటల్ వస్తువులకు దూరంగా ఉండాలి. ఇక కూరగాయలు కట్ చేయడం వంటి పనులు అసలు చేయకూడదు. అంతేకాదు గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో స్నానం కూడా చేయకూడదు. వ్యాయామం చేయడం, ఏవైనా పనులు చేయడం మంచిది కాదు.

గ్రహణం విడిచే వరకు మనసుని తేలికగా ఉంచుకొని, ప్రశాంతంగా పడుకోవడం చేయాలి. గ్రహణం విడిచిన తర్వాత తప్పకుండా గర్భిణి స్త్రీలు స్నానం చేయాలి. ఇక ఈ నియమాలు పాటించడం వల్ల గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో వచ్చే దుష్ప్రభావాల నుంచి తమను, తమ బిడ్డలను కాపాడుకున్నవారవుతారు. ఇక ఈ నియమాలను అనాదిగా గర్భిణీ మహిళలను ఉద్దేశించి పెద్దలు చెప్పారు. నేటికీ వాటిని పాటిస్తూనే ఉన్నారు.

English summary
Today is lunar eclipse. Pregnant women should be careful during pregnancy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X