త్వరలో చంద్రగ్రహణం.. ప్రకటించింది ఈ రాశులకు సంపన్న యోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలకు ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఉంటుందో అదే విధంగా గ్రహణాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెలలో రెండవ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. సెప్టెంబర్ 17, 18 వ తేదీల్లో ఏర్పడే చివరి చంద్రగ్రహణం వేళ కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
వృషభరాశి
వృషభ రాశిలో పదకొండవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు చంద్రుని ప్రభావంతో ఆర్థిక లాభాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. అంతే కాదు ఉద్యోగాలు చేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. సోదరుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.

మిధున రాశి
మిధున రాశిలో పదో స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మిధున రాశి వారికి చంద్రగ్రహణం కలిసొస్తుంది. ఈ సమయంలో పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ సంపద పెరుగుతుంది. కెరీర్ పరంగా నువ్వు ఉన్నత అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలు చేకూరుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం వల్ల విశేష ప్రయోజనాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారి భాగ్య స్థానంలో రాహువు, చంద్రుడు కలవడం వల్ల విదేశీయానానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆదాయపరంగా ఇది బెస్ట్ పిరియడ్.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో ఐదవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయం వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఇల్లు వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. కెరీర్ పరంగాను పురోగతి ఉంది. విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి ఇది మంచి సమయం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశిలో నాలుగవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ కాలంలో మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది. డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక ధన లాభం వస్తుంది. వివాహితులకు పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో తల్లి నుండి పూర్తిగా మద్దతు లభిస్తుంది.
కుంభరాశి
ఈ రాశిలో రెండవ స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది .ఈ సమయంలో కుంభ రాశి వారు అనేక ప్రయోజనాలను ధన లాభాలను పొందుతారు. కుంభరాశి జాతకులు ఈ సమయంలో కొత్త ఆస్తులను, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ పని చేసినా విజయం వరిస్తుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కెరీర్ కూడా బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications