శుక్ర మహాదశలో రాజభోగాలు.. మీ జాతకంలో ఉంటే తిరుగే ఉండదు!!

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని శుభ గ్రహంగా భావిస్తారు. శుక్రుడు సంపదను, అందాన్ని, విలాసాలను సూచించే గ్రహం. అటువంటి శుక్రుడు ఎవరి జాతకంలో నైనా శుభ స్థానంలో ఉంటే వారు దేనికి లోటు లేకుండా భోగాలను అనుభవిస్తారు. నవగ్రహాలలో శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రుడిని ఐశ్వర్య కారకుడిగా కూడా చూస్తారు.

అటువంటి శుక్రుడు ఎవరి జాతకంలో అయితే బలమైన స్థానంలో ఉంటాడో వారు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు. సాధారణంగా శుక్ర మహాదశ 20 సంవత్సరాల పాటు ఉంటుంది. 20 సంవత్సరాల పాటు జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నవారు విలాసవంతమైన, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. రాజ భోగాలను చూస్తారు. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.

Luxury life in Shukra Mahadasa.. If it is in your horoscope, you will be the king!!

జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే ఎంతటి ఉన్నతమైన స్థితిని చూస్తారో .. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అంతటి కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యక్తి కుండలిలో శుక్రుడు బలహీన స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ఆర్థికనష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. రెండు దశాబ్దాల పాటు చాలా కష్టాలను పడాల్సి వస్తుంది. దాంపత్య జీవితంలోను, ప్రేమ జీవితంలోను అన్ని విషయాలలోనూ ఫెయిల్ అవుతారు. కాబట్టి ఎప్పుడు శుక్రుడిని బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉంది.

బలహీనంగా ఉన్న శుక్రుడిని బలోపేతం చేయడానికి వేద జ్యోతిష్య శాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయి. బలహీనమైన శుక్రుడు ఉన్నవారు ప్రతి శుక్రవారం 108 సార్లు ఓం శుం శుక్రాయ నమః అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల శుక్రుడు కాస్త బలోపేతం అవుతాడు. దీనివల్ల ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం పొందొచ్చు.

అంతేకాదు శుక్రవారాలలో తెల్లటి వస్తువులను దానం చేయడం, చీమలకు గోధుమపిండి పంచదార పెట్టడం చేయడం వల్ల కూడా ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. శుక్ర గ్రహం అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తి ఊహించని రాజభోగాలు అనుభవిస్తాడు. శుక్ర మహాదశలో అనుకూల ఫలితాలు వస్తే వారి దశ తిరిగినట్టే!!

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+