Maha shivratri 2024: సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం కోసం మహా శివరాత్రి ప్రత్యేక నివారణలు!!

మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవడానికి భారతదేశంలోని హిందువులంతా రెడీ అయ్యారు. హిందూమతంలో మహాశివరాత్రికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సంవత్సరంలో ప్రతినెలా ఒక శివరాత్రి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. అయితే మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని మహాశివరాత్రి అంటారు.

మహాశివరాత్రి పర్వదినాన పరమేశ్వరుడు, తల్లి పార్వతీ దేవిని పరిణయం చేసుకున్నారని, లింగోద్భవం జరిగిందని చెబుతారు. ఈరోజు పరమేశ్వరుని పూజించడంతో పాటు, కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే సత్ఫలితాలను పొందుతారని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి నాడు శివ యోగంతో పాటు సిద్ది యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుందని చెబుతున్నారు.

Maha shivratri 2024 special remedies for wealth prosperity health

ఈ ప్రత్యేక యోగాలు ఏర్పడిన సమయంలో శివపురాణం ప్రకారం కొన్ని ప్రత్యేక నివారణలు చేస్తే తరగని ఐశ్వర్యం కలుగుతుందని, శ్రేయస్సు పొందుతారని ఆరోగ్యంగా జీవిస్తారని చెబుతున్నారు. మరి ఆ ప్రత్యేక నివారణల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.మహాశివరాత్రి పర్వదినాన శివుని ఆశీర్వాదం కావాలనుకునేవారు, కోరిన కోరికలు తీరాలి అనుకునేవారు 7 నల్ల మిరియాలను, నల్ల నువ్వులను, ఒక ఎండు మిరపకాయను తీసుకొని శివునికి సమర్పించాలి.

ఇలా చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు త్వరలో మీ కోరికలను నెరవేరుస్తాడు. ఇక మహాశివరాత్రి పర్వదినాన శివుడికి రేగుపండ్లను, ప్లమ్ పండ్లను తీసుకుని నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులందరికీ అకాల మరణ భయం తగ్గి, ఆరోగ్యంగా ఉంటారు. రోగాల బారి నుండి కాపాడబడతారు.

మహాశివరాత్రి పర్వదినాన మారేడు చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. పరమశివుడు మారేడు చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించిన వారిపై తన కటాక్షాన్ని ప్రసరింపజేస్తాడు. మారేడు చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించడం వల్ల సంతోషం, శ్రేయస్సు వారి జీవితంలో ఉంటుంది.

మహాశివరాత్రి పర్వదినాన శివుడికి ఏడు ఉమ్మెత్త పువ్వులను సమర్పించండి అంతేకాదు శివలింగానికి భస్మాన్ని సమర్పించడం కూడా మంచిది. దీంతో పరమశివుడు సంతోషం, శ్రేయస్సు మరియు సంపదలను ప్రసాదిస్తాడు. మహాశివరాత్రి పర్వదినాన 11, 21 లేదా 101 మారేడు దళాలను తీసుకుని దానిపై ఓం నమశ్శివాయ అని గంధంతో రాసి శివుడికి సమర్పించండి. దీని వల్ల కూడా శివుడు సంతృప్తి చెంది మీ కోరిన కోరికలు అన్నింటిని నెరవేరుస్తాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+