జులై 26న శక్తివంతమైన మహాలక్ష్మీ యోగంతో మీ సుడి తిరిగినట్టే!
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. చంద్రుడు వేగంగా కదిలే గ్రహం. ఈ రెండు గ్రహాల యుతి కొన్ని రాశులవారికి శుభ, అశుభ ఫలితాలను కలిగిస్తుంది. చంద్రుడు ఒక రాశిలో దాదాపు రెండున్నర రోజుల పాటు ఉంటాడు. జూలై 26న శనివారం మధ్యాహ్నం 3:51 గంటలకు చంద్రుడు సింహరాశిలో ప్రవేశించనున్నాడు. అప్పటికే అక్కడ ఉన్న కుజుడితో కలవనున్నాడు.
మహాలక్ష్మీ రాజయోగం
ఈ సమయంలో దీని వల్ల మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం జూలై 28 సోమవారం వరకు ఉంటుంది. అత్యంత శక్తివంతమైన మహాలక్ష్మీ యోగం సమయంలో కొన్ని రాశులవారు ఊహించని ప్రయోజనాలు పొందుతారు. మహాలక్ష్మీ రాజయోగం ఏ రాశుల వారికి ప్రయోజనకరమో తెలుసుకుందాం.

మిథున రాశి
మిథున రాశి వారికి సింహరాశిలో ఏర్పడే మహాలక్ష్మీ రాజయోగం వల్ల లాభాలుంటాయి. కొత్త పని ప్రారంభించడానికి అనుకూల సమయం. వీరికి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్తగా పెళ్లయిన వారికి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మహాలక్ష్మీ రాజయోగం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో కర్కాటక రాశి వారి ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. కర్కాటక రాశి వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులకు మంచి సంబంధాలు వస్తాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి మహాలక్ష్మీ రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. సింహరాశి వారి సంపద పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. రాజకీయ, పరిపాలన, మీడియా రంగాల్లో పని చేసే వారికి లబ్ది జరుగుతుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. చాలా కాలంగా కష్టపడుతున్న వారికి విజయం లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో పెద్ద విజయం సాధిస్తారు.
మీన రాశి
మీన రాశి వారికి చంద్రుడు, కుజుడు కలయిక వల్ల ఏర్పడే మహాలక్ష్మీ రాజయోగం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ రెండు గ్రహాలు మీ జీవితంలోని సమస్యలను పరిష్కరిస్తాయి. ఈ సమయంలో ఎవరితోనైనా వివాదాలుంటే పరిష్కారమవుతాయి. అవివాహితులకు మంచి సంబంధాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీనరాశిలో ఇదే సమయంలో కేతువు ఆరో స్థానంలో సంచరించడం వల్ల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఐదో స్థానంలో బుధాదిత్య యోగం ఉండటం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులకు విదేశాల నుంచి మంచి ఆదాయం వస్తుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications