మకర సంక్రాంతి నాడే షట్టిల ఏకాదశి.. ఇవి దానం చేస్తే మీ బ్రతుకు బ్రహ్మాండం!

జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మకర సంక్రాంతి మరియు షట్టిల ఏకాదశి ఒకే రోజున వస్తున్నాయి. ఈరోజు విష్ణువు మరియు సూర్యభగవానుని పూజించడంతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా పేదరికం తొలగిపోయి సంపదల ప్రకాశం కనిపిస్తుంది. కొన్ని వస్తువులను ఈరోజు దానం చేయడం శాశ్వత పుణ్యానికి కారణమవుతుంది. సంక్రాంతి పర్వదినాన ఏ వస్తువులను దానం చేస్తే శుభఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.

ఇవి దానం చేస్తే మంచిది
మకర సంక్రాంతి నాడు నువ్వులను దానం చేయడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దీనిని తిల సంక్రాంతి అని కూడా చెబుతారు. ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం వలన శని గ్రహ దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చని, రాహువు, కేతువుల యొక్క బాధలను కూడా తొలగించుకోవచ్చు అని చెబుతారు. కనుక నల్ల నువ్వులను దానం చేయడం మర్చిపోవద్దు.

Makara Sankranthi and Shattila Ekadashi on Same Day these donations gives wealth

ఇది దానం చేస్తే సమాజంలో మీకు గుర్తింపు
మకర సంక్రాంతి పర్వదినాన బెల్లం దానం చేయడం చాలా మంచిది. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలం ముగించుకుని దక్షిణాయన పుణ్యకాలం లోకి ప్రవేశిస్తున్న సమయంలో సూర్యభగవానుడికి అంకితం చేస్తూ, సూర్యుడికి ఇష్టమైన బెల్లాన్ని దానం చేయడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతోపాటు, సమాజంలో మీకు పేరు ప్రతిష్టలను తెస్తుంది.

ఇది దానం చేస్తే అశుభ ప్రభావాలు తగ్గుతాయి
మకర సంక్రాంతి పర్వదినాన కిచిడి ని దానం చేయడం చాలా మంచిది. ఈరోజు కిచిడి ని దానం చేయడం మరియు తినడం వలన శని మరియు చంద్రుల కారణంగా ఏర్పడే అశుభ ప్రభావాలు తగ్గుతాయి. ఇది మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది.

ఇవి దానం చేస్తే విష్ణు ప్రసన్నం
మకర సంక్రాంతి పర్వదినాన అవసరం ఉన్నవారికి దుప్పట్లు మరియు ఉన్ని దుస్తులను దానం చేయడం మంచిది. ఇవి దానం చేయడం వల్ల విష్ణువు యొక్క ప్రసన్నం కలుగుతుందని చెబుతారు. కనుక శీతాకాలంలో జరుపుకునే మకర సంక్రాంతి పర్వదినాన దుప్పట్లను దానం చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+