మాలవ్య రాజయోగం మాటిచ్చింది త్వరలో మీదే అఖండ ధనయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావం చూపిస్తాయి. అనేక శుభ యోగాలను అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. జూన్ 29వ తేదీన రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు వృషభ రాశిలోకి సంచారం చేయడం వల్ల అత్యంత ప్రభావవంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది అనేక రాశుల వారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది.
వృషభరాశిలో మాలవ్య రాజయోగం
ముఖ్యంగా మిధునరాశి వారికి వృషభరాశి వారికి, తులా, మీనరాశుల వారికి మాలవ్య రాజయోగం కారణంగా సానుకూల ప్రభావాలను అనుభవించే అవకాశం లభిస్తుంది. విలాసాలకు, లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు తన సొంతరాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించి కేంద్ర, త్రికోణ స్థానాలలో ఉన్నప్పుడు ఈ రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఈ రాజయోగం యొక్క శుభప్రభావాలు మరింత పెరుగుతాయి. మాలవ్యరాజయోగం కారణంగా శుభఫలితాలను పొందే ఆ రాశులను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
మిధున రాశి వారికి మాలవ్య రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. మిధున రాశి వారి జీవనశైలిలో సానుకూల మార్పులకు ఇది కారణమవుతుంది. పెరిగిన ఆర్థిక లాభాలు, మెరుగైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మెరుగైన సంబంధాలను ఈ రాజయోగం కారణంగా మిధున రాశి జాతకులు అనుభవించే అవకాశం ఉంటుంది. ఇది వీరికి అన్ని విధాల లబ్ధిని చేకూరుస్తుంది.
వీరికి విజయావకాశాలు
మీడియా, రచన రంగాలలో పనిచేసే వారికి కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికల అమలుకు మద్దతుని ఇస్తుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగాను కలిసి వస్తుంది. ఈ రాజయోగం లగ్న గృహంలోనూ, మిధున రాశి నుండి 12వ ఇంట్లోను ఏర్పడడం వల్ల విజయావకాశాలు విపరీతంగా పెరుగుతాయి.
కన్యారాశి
మాలవ్య రాజయోగం కారణంగా కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. ఇది వీరికి ఆర్థిక లాభాలు కలిగిస్తుంది. విలాసవంతమైన అనుభవాలను ఇస్తుంది. వ్యక్తిగత వృద్ధికి దోహదం చేస్తుంది. వీరికి సంబంధాలలో సామరస్యాన్ని కలిగిస్తుంది. అన్ని విధాల ఇది లాభదాయకంగా ఉంటుంది. కెరీర్ మరియు వ్యాపారంలో సానుకూలమైన మార్పులు ఉంటాయి.
వ్యక్తిగత, వృత్తిపర జీవితంలో అదృష్టం
కన్యారాశి నుండి ఉద్యోగం మరియు వ్యాపార స్థానంలో ఈ రాజయోగం ఏర్పడుతున్న కారణంగా వీరికి వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగ జీవితంలో ప్రశంసలు, బోనస్లు మరియు ప్రమోషన్లు వస్తాయి. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఉత్తమ సమయం.
మీనరాశి
మీన రాశి వారికి మాలవ్య రాజయోగం ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుక్రుడు మీన రాశిలో మూడవ ఇంట్లో సంచరించడంతో విజయ అవకాశాలు ఉంటాయి. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రేమ సంబంధంలో ఉంటే సంతోషం ఉంటుంది. జీవితంలో విజయాలు సాధించే అవకాశం ఉంది. భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. వాహనాలు ఆస్తులు కొనుగోలు చేస్తారు. చేసే పనులలో వ్యాపారాలలో అదృష్ట లక్ష్మి వరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications