శుక్ర గోచారంతో మాలవ్య రాజయోగం: వీరికి డబ్బుల సంచులను మోసుకొస్తుంది!!
నవగ్రహాలలో సంపదనిచ్చే గ్రహమైన శుక్రుడు సెప్టెంబర్ నెలలో కొన్ని రాశుల వారికి విలాసవంతమైన జీవితాన్ని ఇస్తాడు. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. జూలై 31వ తేదీ నుంచి సింహరాశిలో సంచరిస్తాడు. రెండు నెలల తర్వాత శుక్రుడు తన సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశిస్తాడు.
తులారాశిలో శుక్ర సంచారంతో మాలవ్య యోగం
సెప్టెంబర్ 18 2024న మధ్యాహ్నం రెండు గంటల నాలుగు నిమిషాలకు తులా రాశిలో శుక్ర సంచారం జరుగుతుంది. అక్టోబర్ 13వ తేదీ వరకు శుక్రుడు తులారాశి లోనే ఉంటాడు. శుక్రుడు తులా రాశి సంచారంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో చాలా శుభయోగాలలో ఒకటిగా మాలవ్య రాజయోగానికి గుర్తింపు ఉంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి సంపదల వర్షం కురుస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
మాలవ్య రాజయోగం కారణంగా మేష రాశి వారికి లబ్ధి జరుగుతుంది. మేష రాశి వారి సంపద పెరుగుతుంది. నూతన ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆస్తులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో గణనీయమైన పురోగతి ఉంటుంది. వివాహితులకు జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు లగ్జరీ లైఫ్ ను గడుపుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి మాలవ్య రాజయోగం ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మాలవ్య రాజయోగం వృశ్చిక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. కెరీర్ కు సంబంధించి శుభవార్తలను వింటారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా ఆస్తి రావచ్చు. వీరి వైవాహిక జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీ కలలన్నీ నెరవేరుతాయి.
కుంభరాశి
కుంభ రాశి వారు శుక్ర సంచారం వల్ల ప్రయోజనాలను పొందుతారు. కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. సంపదలు, వస్తు సౌఖ్యం పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. విదేశాలకు వెళ్లే వారికి శుభ ప్రదంగా ఉంటుంది. కుటుంబంతో ఈ సమయంలో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications