ముగిసిన మంగళ కేతు యోగం... వీరికి మొదలైన అఖండ ధనయోగం!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశిలో కుజ కేతువుల అశుభ యోగం 18 ఏళ్ల తర్వాత ఏర్పడి నేటితో ముగిసింది. జూన్ ఏడవ తేదీన కుజుడు కేతువుల మంగళ కేతు యోగం ప్రారంభం కాగా, అది నేటితో ముగిసింది. ఈ అశుభ యోగం కారణంగా కొన్ని రాశుల వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మంగళ కేతు యోగం ముగియటంతో ప్రస్తుతం కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది.
మంగళ కేతు యోగం
సింహరాశి నుండి కుజుడు కన్యా రాశిలోకి మారడంతో ఈ అశుభ యోగం తొలగిపోయింది. కుజుడిని ధైర్యానికి, కోపానికి ప్రతీకగా చెబుతారు. కేతువును వైరాగ్యానికి, మోక్షానికి, మాయకు ప్రతీకగా చెబుతారు. అటువంటి కుజ కేతువులు సాధారణంగా కలిస్తే ప్రమాదకర ఫలితాలను ఇస్తారు. అయితే ఇంతకాలం కలిసున్న వీరు ఇప్పుడు విడిపోవడంతో కొన్ని రాశుల వారికి కలిసి రాబోతుంది. ఆ రాశులు ఏమిటో చూద్దాం.

మేషరాశి
మంగళ కేతు యోగం ముగియటంతో మేషరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. వీరికి కెరీర్లో పురోగతి ఉంటుంది. మేష రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మేషరాశి వారు సమర్థవంతంగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మేష రాశి వారికి మొండి బాకీలు వసూలు అవుతాయి.
కర్కాటక రాశి
మంగళ కేతు యోగం ముగియటంతో కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.
సింహరాశి
మంగళ కేతు యోగం ముగియడంతో సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు అనేక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఏ పని చేసినా ధైర్యంగా చేస్తారు.
తులారాశి
మంగళ కేతు యోగం కారణంగా ఇబ్బందులు పడిన తులా రాశి వారు ఇప్పుడు ఆ ఇబ్బందుల నుండి బయటపడి సానుకూల ఫలితాలను పొందుతారు. వీరి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందుతారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. స్టాక్ మార్కెట్, బెట్టింగ్, లాటరీ వంటి వాటి నుంచి మంచి ఫలితాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications