March love horoscope: మార్చి నెలలో ఈ రాశులవారు ప్రేమసాగరంలో మునిగి తేలుతారు!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అన్ని రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులకు కారణమవుతుంది. ఇక వచ్చే నెలలో గ్రహాల రవాణా కారణంగా కొన్ని రాశుల వారి జీవితం బాగుంటుంది. వారి జీవితంలో ప్రతికూలమైన ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా మార్చి 15వ తేదీన 5 గంటల 42 నిమిషాలకు అంగారక సంచారం జరుగుతుంది. కుంభరాశిలో అంగారక సంచారం వలన కొన్ని రాశులవారి ప్రేమ జీవితం వికసించబోతుంది.
మేషరాశి :
వీరు ఈ నెలలో ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు. మరి ఆ రాశులు ఏమిటంటే.. కుంభరాశిలో అంగారక సంచారం వల్ల మేషరాశి వారి ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమసంబంధం మెరుగుపడుతుంది. బంధం బలోపేతం అవుతుంది. ఇది మీ ఇద్దరి మధ్య ప్రేమ అవగాహనను మరింత పెంచుతుంది. .ఏమైనా సమస్యలు అపార్ధాలు ఉంటే అవన్నీ తొలగిపోయి ఒకరిపై ఒకరికి ప్రేమ మరింత పెరుగుతుంది.

మిధునరాశి :
కుంభరాశిలో అంగారక సంచారం వలన మిధున రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. వీరు వీరి జీవిత భాగస్వామితో సంతోషంగా జీవించగలుగుతారు. అపరిమితమైన ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు. ఈ సమయంలో బంధం మరింత దృఢం అవుతుంది. మీరిద్దరూ కలిసి బయటకు వెళ్లే అవకాశాన్ని కూడా పొందవచ్చు. మిధున రాశి జాతకులు మరియు వారి భాగస్వాములు కలిసి సంతోషకరమైన సమయాన్ని ఆస్వాదిస్తారు.
కన్యారాశి :
కుంభరాశిలో కుజ సంచారం కన్యా రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జాతకులు ఈ సమయంలో జీవిత భాగస్వామితో ప్రేమ బంధాన్ని బలోపేతం చేసుకుంటారు. అపార్ధాలు అన్ని తొలగిపోయి జీవిత భాగస్వామి పట్ల అంకిత భావంతో ఉంటారు. ఇది వారితో మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామిని సంతోషంగా, సంతృప్తికరంగా ఉంచే ప్రయత్నం చేస్తారు.
కుంభరాశి :
కుంభ రాశిలో కుజ సంచారం కుంభరాశి వారికి కూడా లాభాలను చేకూరుస్తుంది. కుంభ రాశిలో కుజుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన కారణంగా మీ ప్రేమ జీవితం చాలా శృంగార భరితంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని బలోపేతం చేసుకుంటారు. మీకు ఒకరికొకరికి మధ్య కెమిస్ట్రీ బాగా పెరుగుతుంది . అది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. మీరు ఈ సమయంలో సంతోషంగా గడుపుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ ఉండాలంటే ఇలా చేయాలి -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
మేషరాశి, ధనుస్సురాశి, సింహరాశుల వారికి నేటినుండి పట్టిందల్లా బంగారం.. శని మహిమ! -
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications