మార్గశిర మాసం విశిష్టత: విశేష పర్వదినాలు తెలుసుకోండి!!

లక్ష్మీ,నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెబుతారు. మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారంగా చెబుతారు. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మి పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగజేస్తాయని చెబుతారు.

మాసానాం మార్గశీర్షాహం అంటారు కృష్ణభగవానుడు . మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్ఠమైనదని, ఉపయోగకరమైనది అని అర్థం. మార్గశిర మాసంలోనే కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడుతో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషంగా చెబుతారు. ఈ నెలలో లక్ష్మీ నారాయణుడిని తులసి మాలతో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని అంటారు.

Margasira Masam importance: Know the Special Days!!

ఈ మాసంలో వచ్చే గురు వారాలలో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వృద్ధి చెందుతాయి అని చెబుతారు. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసం చాలా శుభప్రదమైనదిగా చెబుతారు. ఇక ఈ మాసంలో విశేష పర్వదినాల విషయానికి వస్తే మార్గశిర శుద్ధ తదియనాడు ఉమామహేశ్వర వ్రతం చేసే ఆచారం అనాదిగా ఉంది.

మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగ పంచమి చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. మార్గశిర షష్టి.. ఇది సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం. దీనినే సుబ్రహ్మణ్య షష్టి అని కూడా అంటారు. ఈ విశేష పర్వదినాన్ని కూడా ఈ మాసంలోనే జరుపుకుంటాం. ఇక మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినంగా చెబుతారు. దీనిని కాలభైరవాష్టమి గా కూడా చెబుతారు.

మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతిగా చెబుతారు. భగవద్గీత లోకానికి అందిన రోజు ఇదేనని, ధనుర్మాసం ఆరంభం అయితే దీనిని వైకుంఠ ఏకాదశి అని లేదా ముక్కోటి ఏకాదశి అని చెబుతారు. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా చెబుతారు. మార్గశిర పూర్ణిమను శ్రీ దత్త జయంతిగా జరుపుకుంటారు. దీనినే కోరల పూర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనేక విశేషమైన పర్వదినాలు ఉండే మార్గశిర మాసంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+