నేటినుండి వీరు నక్కతోక తొక్కుతారు

గ్రహాల అధిపతి అయిన కుజుడు త్వరలో బుధ గ్రహం పాలించే జ్యేష్ఠ నక్షత్రం లోకి ప్రవేశించ బోతున్నాడు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని, మరియు నక్షత్రాన్ని మారుస్తాడు. కుజుడు ఒక రాశిలో దాదాపు 45 రోజుల పాటు ఉంటాడు. ప్రస్తుతం కుజుడు తన సొంత రాశి అయిన వృశ్చికంలో ఉన్నాడు. రుచక రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు.

జ్యేష్ఠ నక్షత్రంలోకి కుజుడు
కుజుడు నవంబర్ 19వ తేదీన జ్యేష్ఠ నక్షత్రం లోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. వారికి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుజ గ్రహ నక్షత్ర సంచారం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుజుడు నక్షత్ర సంచారం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులను గురించి తెలుసుకుందాం.

mars in jyeshta nakshatra gives luck and happiness to these zodiac signs

తులారాశి
జ్యేష్ఠ నక్షత్రంలో కుజ సంచారం తులా రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. తులా రాశిలో రెండవ ఇంట్లో కుజుడు సంచరించడం వల్ల ఇది వీరికి ఫలదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. వీరు జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును చూస్తారు. తులా రాశి వారు ఆకస్మిక ధన లాభం పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు.

వృశ్చిక రాశి
జ్యేష్ఠ నక్షత్రంలో కుజ సంచారం వృశ్చిక రాశి జాతకులకు అన్ని విధాల కలిసొస్తుంది. వృశ్చిక రాశిలో లగ్న గృహంలో కుజ సంచారం జరగడం వల్ల ఈ రాశి వారు గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు . వీరిలో నాయకత్వ సామర్థ్యాలు వేగంగా పెరుగుతాయి కెరీర్లో ప్రయోజనాలను చూస్తారు. ప్రభుత్వం నుంచి గణనీయమైన లాభాలను పొందుతారు. ఆస్తులు వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది.

మీన రాశి
జ్యేష్ఠ నక్షత్రంలో కుజ సంచారం మీనరాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు ఉద్యోగంలో ప్రయోజనాలను పొందుతారు. వీరి అదృష్ట గృహంలో కుజ సంచారం జరగడం వల్ల ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి గణనీయమైన అవకాశాలు కనిపిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+